ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలామంది ఆ శక్తిగా ఎదురు చూస్తున్న ‘రుద్రమదేవి’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. గతవారం శివరాత్రి రోజు విడుదల అవుతుంది అనుకున్న ఈసినిమా ధియేట్రికల్ ట్రైలర్ విడుదల కాకపోవడంతో ‘రుద్రమదేవి’ మళ్ళీ వెనక్కు నడిచింది అని అనుకున్నారు అంతా. అయితే ఈసారి గుణశేఖర్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఆ న్యూస్ ను ఒక ఇన్విటేషన్ లా డిజైన్ చేసి మీడియాకు విడుదల చేయడం అందరికీ ఆ శక్తిగా మారింది.

సామాన్యంగా పుట్టినరోజులకు, పెళ్ళిళ్ళకు, గృహప్రవేసాలకు, ఫంక్షన్స్ కు ఇలా ఇన్విటేషన్ ను డిజైన్ చేసి గెస్టులను పిలుస్తూ ఉంటారు. కాని గుణశేఖర్ ఒక సినిమా ట్రైలర్ విడుదలకు ఇన్విటేషన్ డిజైన్ చేయడం ఒక న్యూ ట్రెండ్.

ఈ సినిమా ట్రైలర్ ఈనెల 28వ తారీఖున విడుదల చేస్తున్నాం, అని చెప్పడమే కాకుండా ఈ ట్రైలర్ ను చూసి ప్రోత్సహించమని గుణశేఖర్ వెరైటీగా అభ్యర్ధించాడు. అంతేకాదు ఈ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ ను ఘనంగా జరపబోతున్నామని మిగతా వివరాలు ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటిస్తానని గుణశేఖర్ తెలియచేసాడు.

అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుని ఎంతో కష్టపడి ఒక చారిత్రాత్మక సినిమాను భారీ బడ్జెట్ తో తీసిన గుణశేఖర్ ఈ సినిమా విజయం పై చాల ఆశలే పెట్టుకున్నాడు. అనుష్క క్రేజ్ తో పాటు బన్నీ ఇమేజ్ కూడా తోడు కావడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 8 కోట్ల 50 లక్షలకు ఒక ప్రముఖ ఛానల్ తీసుకున్నట్లుగా వార్తలు రావడం ‘రుద్రమదేవి’ సినిమా మార్కెట్ కు శుభారంభం..

మరింత సమాచారం తెలుసుకోండి: