ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు జరుగుతున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాకుండా చాల టెన్షన్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒక్క మహేష్ కు తప్ప అందరూ తమతమ సినిమాల విజయంతో మంచి జోష్ మీద ఉండటం. మహేష్ కు సూపర్ హిట్ వచ్చి రెండు సంవత్సరాలు దాటి పోవడంతో టాప్ హీరోల రేస్ లో మహేష్ ఎక్కడ వెనక పడిపోతాడో అన్న భయం ప్రస్తుతం ప్రిన్స్ అభిమానులను విపరీతంగా వెంటాడుతోంది అని టాక్.

ఈనేపధ్యంలో గతవారం మహాశివరాత్రి రోజున విడుదల అవుతుంది అనుకున్న మహేష్ కొరటాల శివల సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాకపోవడం మహేష్ అభిమానులను మరింత అయోమయంలో పడేసింది అని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నా వినపడుతున్న ఆ వార్తల పై దర్శకుడు కొరటాల శివ ఎటువంటి స్పందన తెలియ చేయకుండా ప్రవర్తిస్తూ ఉండటం మహేష్ అభిమానులకు తీవ్రకోపాన్ని కలిగిస్తోంది అని అంటున్నారు.

దీనితో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తారు అంటూ మహేష్ అభిమానులు దర్శకుడు కొరటాల పై మెసేజ్ లు ద్వారా ఒత్తిడి పెంచుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. జరుగుతున్న ఈ పరిణామాలు మహేష్ దృష్టికి కూడా రావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ అదేవిధంగా టైటిల్ రాబోతున్న ఉగాది రోజు మార్చి 21న ఖచ్చితంగా విడుదల చేసి తన అభిమానుల కోరికను తీర్చమని మహేష్ సూచించినట్లు టాక్.

ఈ సినిమా విషయంలో ఇంత లో ప్రొఫైల్ పబ్లిసిటీ చేయడానికి గల ప్రధాన కారణం మహేష్ ‘వన్’, ‘ఆగడు’ సినిమాల ఘోర పరాజయాలు అని అంటున్నారు. అభిమానులలో విపరీతమైన అంచనాలు పెంచకుండా ఈసారి సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలనే ఎత్తుగడలోనే ఈ ఆలస్యానికి కారణం అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: