మెగా కుటుంబంలో ఏడుగురు హీరోలు ఉండటంతో అల్లుఅరవింద్ కు బయట హీరో గురించి ఆలోచించే అవసరం లేదు. ఈ నేపధ్యంలో మెగా కుటుంబ ద్వార తలుపులు ఒక యంగ్ హీరోకి తెరుచుకోవడం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘ఈగ’ సినిమా తరువాత ఒక్క హిట్ కూడా చూడని నానీకి మెగా కుటుంబ సినిమాలో ఆఫర్ రాబోతూఉండటం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.

ప్రస్తుతం నాని తాను నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకా ఆ సినిమా విడుదల కాకుండానే నానీకి అదృష్టం అల్లుఅరవింద్ రూపంలో తలుపు తట్టింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో నాని మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు అనే వార్తలు వస్తున్నా ఆ వార్తలు అధికారికంగా ధృవపడలేదు.

అయితే అనుకోకుండా మారుతి చెప్పిన కథ అల్లుఅరవింద్ కు బాగా నచ్చడంతో ఆ కథను సినిమాగా తీయమని అల్లుఅరవింద్ లైన్ క్లియర్ చేయడమే కాకుండా మారుతి సూచనమేరకు ఈసినిమాలో నానీని హీరోగా ఎంపిక చేసారు అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

‘కొత్త జంట’ సినిమా తరువాత మారుతి టాలెంట్ నచ్చడంతో గతంలోనే అరవింద్ మారుతికి మరో అవకాశం ఇస్స్తాను అని మాట ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ మాట కార్య రూపం దాల్చి అల్లుఅరవింద్, మారుతి, నానీల క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది అని టాక్. ఎలా చూసుకున్నా ఇది నానీకి అనుకోకుండా అదృష్టం మెగా ద్వారం ద్వారా వచ్చింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: