సినిమాలలో ఒక హీరో మరో హీరోయిన్ ను ముద్దు పెట్టుకునే సీన్స్ సర్వసాధారణం. కానీ ‘టెంపర్’ సినిమా సక్సస్ కు సంబంధించిన పార్టీలో నిర్మాత బండ్ల గణేష్ ప్రముఖ గుట్కా వ్యాపార వేత్త, హీరో సచిన్ జోషిని ముద్దు పెట్టుకున్న ఫోటోలు ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.

బండ్ల గణేష్ సచిన్ జోషీల మధ్య వ్యాపార వ్యవహారాలు ఎంత లోతుగా ఉన్నాయో తెలియక పోయినా వీరిద్దరి మధ్య ప్రస్తుతం స్నేహ బంధం పీకల లోతులో ఉంది అని అనిపించేడట్లుగా ఈ ఫోటో కనిపిస్తోంది. అందుకే కాబోలు ‘టెంపర్’ సినిమాకు అనధికార నిర్మాతగా సచిన్ జోషి హడావిడి చేస్తున్నాడు.

వీరిద్దరి మధ్య ‘టెంపర్’ పార్టీలో జరిగిన ముద్దు వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ కు అత్యంత చర్చనీయాంసంగా మారింది. ఈ వార్తలు ఇలా ఉండగా ‘టెంపర్’ సక్సస్ పూరీకి, జూనియర్ కు, బండ్ల గణేష్ కు ఆనందం ఇస్తున్నా ఈ సినిమా బయ్యర్లకు ఇంకా పూర్తి ఆనందాన్ని తెచ్చి పెట్టడంలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి కారణం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి అంటే ఇంకా 10 కోట్లు రాబట్టవలసి ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుండి ‘టెంపర్’ కలెక్షన్స్ కోస్తా ప్రాంతాలలో కలక్షన్స్ డౌన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పట్లో విడుదల అయ్యే భారీ సినిమాలు ఏమి లేవు కాబట్టి ఈ ఒక్క విషయమే ‘టెంపర్’ ను కాపాడాలి అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: