పవన్ అంటే ఒక వ్యసనం, పవన్ అంటే ఒక పిచ్చి పవన్ అంటే.... ఇలా ఈ మధ్య పవన్ కళ్యాన్ గురించి సినిమాల్లో బయటా ఓ రేంజ్ లో టాక్ వినపడుతుంది. నిజానికి పవన్ కళ్యాన్ ఏం చేసినా సంచలనాలకు నాంది పలుకుతుంది. ఆయన సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయిన ఒక ట్రెండ్ సృష్టిస్తున్నాడు లేదు లేదు సెట్ చేస్తున్నాడు.

పవన్ కళ్యాన్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆ ఇమేజ్ చట్రంలో పడకుండా తనకు తానుగా ఒక స్టయిల్ క్రియేట్ చేసుకున్నాడు. మొదట్లో సినిమాలు ఫ్లాపులు, సక్సెస్ లు ఇలా సాగుతూ వచ్చినప్పటికి ఆయన ఏమాత్రం వెనకంజ వేయకుండా ముందుకు దూసుకెళ్లాడు హిట్ మీద హిట్ కొడుతున్నాడు. అంతే కాదు పవన్ కళ్యాన్ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడనడంలో ఆశ్చర్యం లేదు.

ప్రకృతి విపత్కర పరిస్థతులు సంబవించినప్పుడు దిక్కు లేని వారికోసం మొదటిగా స్పందిస్తుంటాడు. ఈయన స్థాపించిన ‘జనసేన’ ఏ ట్రెండ్ సృష్టించిందో చెప్పనక్కరలేదు. రాజకీయాలనే ఒక్క కుదుపు కుదిపేసింది. అలాంటి పవన్ కళ్యాన్ ని పెట్టి దాసరి సినిమా నిర్మిస్తున్నాడనే అనే వార్త ఇప్పడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

ఈ మధ్య కాలంలో రాజకీయాలకు దూరంగా వున్న దాసరి కాపులను ఒక్క తాటిపై తీసుకు రావడం కొరకు పవన్ కళ్యాణ్‌ ఇమేజ్ ని వాడుకోవాలని చూస్తున్నాడా అని గుస గుస... గతంలో చిరంజీవితో దాసరి లంకేశ్వరుడు సినిమా తీశారు. ఇప్పుడు పవన్ కళ్యాణతో సందేశాత్మక చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారు. అయితే ఈ సినిమాకు దాసరి నిర్మాతగానే వ్యవహరిస్తారని టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: