‘ముకుంద’ సినిమా పరాజయం తరువాత వరుణ్ తేజ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తాడు అని వార్తలు వచ్చాయి. అయితే వరుణ్ తేజ్ క్రియేటివ్ దర్శకుడు క్రిష్ వైపు చూస్తున్నాడు అని ఆ తరువాత ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కౌంట్ డౌన్ మొదలు కాబోతోంది. ఈసినిమా పూజా కార్యక్రమాలు ఎల్లుండి 27వ తారీఖున జరగబోతోంది అని ఫిలింనగర్ టాక్.

అయితే తన రెండవ సినిమాతోనే వరుణ్ తేజ్ ఒక ప్రయోగాత్మక సినిమాలో నటించబోతూ ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ యంగ్ మెగా హీరో కోసం క్రిష్ తయారు చేసిన స్క్రిప్ట్ 1940 కాలం నాటి ఒక ప్రేమ కథ అని అంటున్నారు.

ఈకథ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ గా ఉంటుందా లేదంటే మొత్తం సినిమా అంతా కూడా స్వాతంత్రం పూర్వం జరిగిన ప్రేమకథగా మారిపోతుందా అన్న విషయం పై క్లారిటీ లేదు. ప్రయోగాలకు చిరునామాగా ఉండే క్రిష్ సినిమాలు ఒకొక్కసారి ప్రేక్షకులకు అర్ధంకాకా పరాజయం పొందిన సందర్భాలు గతంలో ఉన్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో మొదటి సినిమా విజయవంతం కాని నేపధ్యంలో ఒక రొటీన్ సినిమాను ఎంచు కోకుండా మళ్ళీ క్రిష్ లాంటి క్రియేటివ్ దర్శకుల ప్రయోగాల మధ్య వరుణ్ తేజ్ ఎందుకు చిక్కుకున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ మెగా యంగ్ హీరో తన ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: