మూడు దశాబ్ధాలుగా తెలుగు సినిమా రంగాన్ని తన హాస్యంతో ఏలుతున్న బ్రహ్మనందం హవా అయిపోయింది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో వీకెండ్ వెంకట్రావ్ గా మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి.

రామ్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘పండుగ చేస్కో’ సినిమాలో బ్రహ్మి కోసం ప్రత్యేకంగా ఈపాత్రను డిజైన్ చేసారు అని టాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో వచ్చే ఈ వీకెండ్ వెంకట్రావ్ పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా మారుతుంది అని టాక్.

గతసంవత్సరం విడుదలైన అల్లుఅర్జున్ ‘రేసుగుర్రం’ సినిమా విజయంలో బ్రహ్మి కిల్ బిల్ పాండే ఎంత ప్రధాన పాత్ర వహించిందో అంతకు మించి ఈ వీకెండ్ వెంకట్రావ్ పాత్రతో రామ్ ‘పండుగ చేస్కో’ విజయవంతం అవుతుందని ఈ సినిమా యూనిట్ విపరీతమైన నమ్మకం పెట్టుకుంది అని అంటున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న హిట్ అన్న పదమే దరికి రాని రామ్ కు, ఈ లేటెస్ట్ ప్రయత్నo బ్రహ్మీ వీకెండ్ వెంకట్ర్రావ్ ఎంత వరకు సహకరిస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: