ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లడంతో పాటు మంచి కలెక్షన్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టెంపర్ సక్సెస్ పార్టీకి సంభందించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఈ పార్టీలో పూరి, ఎన్టీఆర్, వర్మ , గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీ ఉత్సాహంలో కేక్ కటింగ్ గురించి ఎన్టీఆర్ చాలా ఉల్లాసంగా మాట్లాడారు. కేక్ పై టెంపర్ పేర్లను రాసి ఉండటంతో ఈ కేక్ ను ఎలా కట్ చేయాలో అర్దం కట్ చేయాలో అర్దం కావటం లేదంటున్నాడు ఎన్టీఆర్.

ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందీ లో రీమేక్ చేయటానికి సచిన్ జోషి సిద్దపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. హిందీ వెర్షన్ కు గన్ డే, రామ్ లీల చిత్రాల హీరోగా రణవీర్ సింగ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. రీసెంట్ గా సచిన్ ..రణబీర్ ని ఎప్రోచ్ అయినట్లు సమాచారం. బ్లాంక్ చెక్ ని రెమ్యునేషన్ గా ఆఫర్ చేసాడని, అయితే రణబీర్..చిత్రం చూసి చెప్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే రణబీర్ తప్పక ఒప్పుకుంటాడు అంటున్నారు. టెంపర్ సక్సెస్ కారణంగా ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లాంటి పార్టీని ఏర్పాటు చేసిన నిర్మాత బండ్ల గణేష్ టెంపర్ 2 ని ప్రకటించారు. ఆయన ట్వీట్ చేస్తూ...‘' మీ అభిమానం, ప్రేమతో...టెంపర్ 2 రెడీ చేస్తాము ‘' అన్నారు. ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించిన ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తో ముందుకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: