చేసిన పాపం ఊరికే పోతుందా వెంటాడి మరీ బాధిస్తుంది అంటారు పెద్దలు. మూగజీవాలపై ప్రతాపం చూపించబోయి మన బాలీవుడ్ కండల వీరుడు కంటిమీద కునుకు లేకుండా భాదపడాల్సి వస్తుంది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌పై ఉన్న కృష్ణ జింకల వేట కేసులో బుధవారం రావాల్సిన తీర్పు మార్చి వ తేదీకి వాయిదా పడింది.

దీంతో మనోడికి కాస్త ఊరట లభించినట్లయింది. రాజస్థాన్‌ జోథ్‌పూర్‌ కోర్టు తీర్పును వెలువరించింది.  ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. తీర్పు వస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో సల్మాన్‌ ఖాన్‌కు మూడు నుంచి ఏడేళ్లు జైలు శిక్షపడే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే లో హమ్‌ పాథ్‌ పాథ్‌ హై సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌సోనాలీ బింద్రేటబు.. కృష్ణ జింకలను వేటాడారంటూ కేసు నమోదయ్యింది. ఈ కేసులో సల్మాన్‌ ఖాన్‌ కొంతకాలం జోథ్‌పూర్‌ జైల్లో గడిపాడు.అయితే కేసును విచారించిన కోర్టు తుది తీర్పును మార్చి 3వ తేదికి వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపున న్యాయవాది పిల్ దాఖలు చేశాడు. ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో సల్మాన్ పై నేరం రుజువైతే మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడవచ్చని, అంతేగాక వెంటనే బెయిల్ కూడా దొరకదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: