ఈ మధ్య కాలంలో వెండితెర కంటే బుల్లి తెరపైనే అందాల భామలు ఎక్కువైనట్లు కనిపిస్తున్నారు. సీరియల్స్ లో ఈ కాంపిటేషన్ ఎలాగూ ఉంటుంది. కానీ యాంకరింగ్ వాళ్ల విషయమైతే ఈ కాంపిటీష్ కాస్త ఎక్కువే అవుతుంది. తమ అందాల ప్రదర్శనతో బుల్లి తెరపై ఒక్క ఊపు ఊపుతున్నారు. గతంలో యాంకరింగ్ అంటే తాము చేసే కార్యక్రమం టెలివిజన్ వీక్షకులకు ఏమేరకు అర్థమయ్యే రీతిలో ఉంటే చాలు అని అనుకునే వారు. కానీ ఇప్పడు ఆ ట్రెండ్ పోయింది జనాల్లో తామెంత పాపులరయ్యామా లేదా అనే చూస్తున్నారు.

యాంకరింగ్ చేస్తూ సినిమా ఛాన్సులు కొట్టేసి భామలు చాలామందే ఉన్నారు. భారత దేశంలో అన్ని చానల్స్ లో వచ్చే యాంకర్స్ తర్వాతి కాలంలో మంచి సినిమల్లో చాన్సులు కొట్టేసి పేరు సంపాదించుకున్నారు. కాకపోతే అది హీరోయిన్ స్థాయికి కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అయినే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు. విషయానికి వస్తే ఈ మధ్య తెలుగు బుల్లి తెరపై ఇద్దరు మాత్రం ఒకరిని మించి మరొకరలు తమ అందాలు హావభావాలతో కిర్రెక్కిస్తున్నారు.

మీకప్పుడే అర్థమయ్యిందనుకుంటా..? వారేనండీ అనసూయ, రేష్మా ఒకప్పడు జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో అనసూయ ఒక్క ఊపు ఊపిందనే చెప్పాలి ఈ కార్యక్రమం ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాదు అనసూయ ఆడియో ఫంక్షనల్లో కూడా తన అందచందాలు ప్రదర్శించి జనాల మతులు పోగొట్టేదంటే నమ్మండి. తర్వాత ఆమె సినిమాల్లో చిన్నా చితక క్యారెక్టర్స్ వేసింది. కాకపోతే తన రేంజ్ క్యారెక్టర్ ఏం రాలేదని అలాంది ఏదైనా వస్తే తన టాలెంట్ చూపిస్తాని చెపుతుంది అనసూయ.

ఇక రేష్మ విషయానికి వస్తే అనసూయ తర్వాత జబర్దస్త్ యాంకర్ బాధ్యతలు చేపట్టింది. ఆ కార్యక్రమంలో ఆమె హైలేట్ గా నిలుస్తుందనటానికి ఆమె వేసే డ్రెస్సింగే కారణం అబ్బో ఆ అందాల ఆరబోత అంతా ఇంతా కాదండి బాబు కుర్రకారు మతులు పోగొడుతుంది. రేష్మా కూడా సినిమాల్లో నటించింది. మొత్తానికి ఇలా బుల్లి తెరపై తమ అందాలతో భలే క్రేజ్ సంపాదించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: