సాధారణంగా హీరోయిన్స్ ఒకరిపై ఒకరు కామెంట్ చేసే ముందు కాస్త ఆలోచించుకొని మరీ చేస్తుంటారు. టాలీ వుడ్ లో ఈ మధ్య రకూల్ కి మంచి హిట్ లే వచ్చాయని చెప్పొచ్చు. పోటుగాడు, లౌక్యం, రఫ్ లాంటి హిట్ సినిమాలు వచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

స్వతాహాగా రకూల్ మోడల్ అనుకోకుండా వచ్చిన సినీ ఆఫర్లతో అమ్మడు ఓ రేంజ్ కి ఎదిగి పోయింది. ఈ విషయంలో అగ్ర తారలైతేమరీనూ.. అయితే నిన్నమొన్న వచ్చి అగ్రహీరోయిన్ల సరసన నిలబడిన రకూల్ ప్రితిసింగ్ నిర్మోహమాటంగా హీరోయిన్స్ పై సెటైర్లు వేస్తుంది.

మరి ఆమె సరదాకి చెప్పిందా నిజంగానే చెప్పిందా దేవుడెరు ఈ విషయం మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిగా మారింది. తాజాగా రకూల్ ఒక టీవీ ప్రోగ్రాంలో సందడి చేసింది. రకుల్ ‘ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఎవరు దేనికి ఎక్కువగా సెట్ అవుతార’న్న ప్రశ్నకు, ‘సమంత ఫ్యాషన్ వరల్డ్ కు, తమన్నా షాప్ ఓపెనింగ్స్ కు, త్రిషా రిబ్బన్ కటింగ్స్ కు బాగా సెట్ అవుతార’ని చెప్పుకొచ్చింది.

చేసేది టీవీ షో అని దాన్ని చాలా మంది చూస్తుంటారని రకూల్ కి తెలియదా లేక నాకేంటీ అన్న లెక్కలేని తనమా తెలియదు కానా ఇంత పెద్ద స్టార్ హీరోయిన్స్ పై రకుల్ చేసిన కామెంట్స్ హాట్ హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: