మెగా వారసుడిగా వచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా రాంచరణ్ మంచి హిట్ సినిమాలో తీశాడు. చెర్రీ నటించిన మగధీర ఇప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందంటే అతిశయెక్తి కాదు. చరణ్ తీసిన సినిమాల్లో ఒకటీ రెండు ప్లాపులు తప్ప మిగతావి సూపర్ డూపర్ హిట్లే. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా అంతగా వర్క్ అవుట్ కాకపోయినా రామ్ చరణ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని తెచ్చి పెట్టింది. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతున్నారు.

తమిళంలో ఈ సినిమాకి ‘రామ్ లీల' అనే టైటిల్ ని ఖరారు చేసారు. వాస్తావనికి మనోడికి తమిళంలో కూడా డీసెంట్ మార్కెట్ ఉంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘మావీరాన్' (మగధీర డబ్ వెర్షన్) సినిమా అక్కడ పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాకి అక్కడ బాగానే క్రేజ్ ఉంది.

అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఉండడంతో తమిళ నిర్మాతలు అక్కడ కూడా విజయం సాధిస్తుందని అంటున్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.రామ్‌చరణ్‌ హీరోగాగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. మార్చి 5న చిత్రాన్ని ప్రారంభిస్తారు. 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్ మొదలవుతుంది. ఈ విషయాలను ధృవీకరిస్తూ నిర్మాత మీడియాకు ప్రకటన విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: