ఎన్నో అంచనాలతో ప్రారంభమైన అఖిల్ వినాయక్ ల సినిమా మొదటి షెడ్యూల్ 5 రోజులు షూటింగ్ జరుపుకుని ముగిసింది. రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాలను పోలిన ఒక సెట్ ను డిజైన్ చేసి అఖిల్ ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశాలు ఐదు రోజుల పాటు నైట్ ఎఫెక్ట్స్ తో చిత్రీకరించారు అని తెలుస్తోంది. అయితే సినిమాలో కేవలం 3 నిముషాల పాటు మాత్రమే ఉండే అఖిల్ ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేసాల కోసం దాదాపు కోటి రూపాయల ఖర్చు పెట్టారు అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.

కేవలం అఖిల్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టారు అంటే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యే సరికి ఈ సినిమా బడ్జెట్ ఏ రేంజ్ కి వెళ్ళిపోతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా యూనిట్ అతి త్వరలో ఆఫ్రికా అడవుల ప్రాంతం వైపు వెళ్ళు తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను దక్షిణాఫ్రికా అటవీ ప్రాంతంలో చిత్రీకరించడానికి వినాయక్ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ను ఆఫ్రికాలోని దట్టమైన అడవుల ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అత్యంత ప్రమాదకరమైన ఈ అటవీ ప్రాంతంలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఏర్పాట్లు జరుగుతూ ఉండటంతో ఈ రెండవ షెడ్యూల్ కు కూడా చాల భారీగానే ఖర్చు పెట్టబోతున్నారని టాక్. హీరో నితిన్ స్వయంగా ఈ ఏర్పాట్లను పర్య వేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: