టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ హావా కొనసాగుతున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో హీరోల కంటే హీరోయిన్సే ఎక్కువ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. మూవీలో హీరోయిన్స్ కనపడేది కేవలం పది సీన్స్ అయినప్పటికి, రెమ్యునరేషన్ మాత్రం లక్షల్లో ఉండాల్సిందేనట.

వివరాల్లోకి వెళితే, రామ్‌చరణ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి మైనేమ్ ఈజ్ రాజు అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. మార్చి 5న లాంఛనంగా పూజాకార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అదే నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో లీడ్ హీరోయిన్ గా రకుల్‌ప్రీత్ సింగ్‌ను సెలక్ట్ చేశారు.

కాగా రెండో హీరోయిన్ గా కృతి కర్బందాను తీసుకున్నట్టు చిత్ర వర్గాల సమాచారం. ఒంగోలుగిత్త, ఓం త్రీడీ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో కథానాయికగా రేసులో వెనకబడ్డ కృతి కర్బందా ఈ చిత్రంలో రెండవ నాయికగా నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతుంది. రామ్ చరణ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నందుకు దాదాపు కోటిన్నర రూపాయలు తీసుకుంటున్నట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.

అయితే మొదటి హీరోయిన్ అయిన రకుల్ మాత్రం కేవలం 50 లక్షలకే ఒప్పుకున్నట్టు చిత్ర వర్గాల సమాచారం. ఇందులో రామ్‌చరణ్‌కు తల్లి పాత్ర కోసం జీవితా రాజశేఖర్, రమ్యకృష్ణ, శోభనను దర్శకుడు సంప్రదించాడని వీరిలో శోభన తల్లిగా నటించడానికి అంగీకరించనట్టు విశ్వసనీయ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: