ఇప్పటి దాకా టాప్ హీరోల సినిమాల విడుదలకు ముందు ఆ సినిమాలలోని కొన్ని సన్నివేసాల వీడియోలు పైరసీ రూపంలో బయటకు వచ్చి హడావిడి చేసిన సందర్భాలు చూశాం. అసలు ఇప్పటి వరకు అధికారికంగా సినిమా టైటిల్ కూడా ప్రకటింప బడని మహేష్ కొరటాల శివల లేటెస్ట్ మూవి సినిమా ఫస్ట్ లుక్ అంటూ వెబ్ మీడియాలో గత రెండు రోజులుగా హడావిడి చేస్తున్న మహేష్ ‘శ్రీమంతుడు’ ఫేక్ ఫస్ట్ లుక్ ల వ్యవహారం ప్రిన్స్ మహేష్ బాబుకు ఖంగారు పుట్టిస్తోంది అని టాక్.

ఈ ఫేస్ ఫస్ట్ లుక్ లను ఎవరు డిజైన్ చేసారో తెలియక పోయినా నిజమైన సినిమా ఫస్ట్ లుక్ అని అనిపించే డట్లుగా ఉంది. టాప్ హీరోల పట్ల అభిమానం సర్వసాధారణమైన విషయమే అయినా మహేష్ బాబు పట్ల ఉండే మితిమీరిన అభిమానం ఈ ఫేక్ ఫస్ట్ లుక్ గా మారింది అనుకోవాలి.

రెండు ఘోర పరాజయాల తరువాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మహేష్ అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా ఆ శక్తి ఈ సినిమా పై ఎక్కువగా ఉంది. మితిమీరిన పబ్లిసిటీ ఈ సినిమాకు ఎక్కడ చెడు చేస్తుందో అన్న తలంపుతో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఈ సినిమా టైటిల్ దగ్గర నుండి మిగతా అన్ని విషయాల పై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ ఉంటే ఆ మౌనాన్ని తట్టుకోలేని కొందరు మహేష్ వీరాభిమానులు ఈ ఫేక్ ఫస్ట్ లుక్ తో ఇలా వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నారా అని అనిపిస్తోంది.

శివరాత్రికి వస్తుంది అనుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాకపోవడంతో ఇలా సాహసించి ఎవరో క్రియేట్ చేసిన ఈ ఫేక్ ఫస్ట్ లుక్ ల హడావిడి టాపిక్ ఆఫ్ దిడేగా మారింది. ఎలా చూసుకున్నా ఉగాదికి కూడా ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ విడుదల కాకపోతే మరిన్ని ఇలాంటి ఫేక్ ఫస్ట్ లుక్ లు వచ్చే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: