గత కొద్ది సంవత్సరాలుగా టాప్ హీరోలు కూడా తమ సినిమాలలో పంచ్ డైలాగ్స్ లేకుండా సినిమాలను తీసి విడుదల చేయలేక పోతున్నారు. సినిమా కథ గురించి కూడ పట్టించుకోని టాప్ హీరోలు తమ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పంచ్ డైలాగ్స్ పై శ్రద్ధ కనిపిస్తూ వచ్చారు. పంచ్ డైలాగ్స్ ఉన్నంత మాత్రాన ప్రతి సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం లేకపోయినా గత కొద్ది సంవత్సరాలుగా పంచ్ ల మాయలో టాలీవుడ్ మునిగి పోయింది.

ఇక లేటెస్ట్ గా సెన్సార్ ప్రకటించిన కొత్త నిభంధనలతో బూతులతో కూడిన పంచ్ లకు కాలం చెల్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త నిబంధనలతో ఇక సినిమాలో తీయడం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. ‘డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు వచ్చి తోడ కొట్టిందట’ అన్న డైలాగ్ మహేష్ నోటి వెంట ఆగడు సినిమాలో వినిపించి హడావిడి చేసింది..

రవితేజా ‘బలుపు’ సినిమాలో ‘పుల్కా’ అంటూ బ్రహ్మిని ఆట పట్టిస్తాడు. అదే విధంగా అలీ ‘పెట్టుకుంటే నాకు కారిపోయేలా ఉంది’ అంటూ ‘చిన్నదానా నీకోసం’ సినిమాలో బూతు డైలాగ్ లు వాడి ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఇక అటువంటి డైలాగ్స్ రాబోయే కాలంలో వినిపించవు.

కొత్త సెన్సార్ గైడ్ లైన్స్ ప్రకారం తెలుగు సినిమాలకు సంబంధించి ‘ఉచ్చ పోయిస్తా, దొబ్బెయ్, తొక్కలో, పుడింగి, పక్కేసావా, ముండా, కడుక్కoదాo, లుచ్చా, బొక్కనాయాలా, దూలతీరిందా’ తో పాటు మరో 20 పదాలను సినిమాలలో వాడకుండా నిషేధం విధించడంతో ఇక భవిష్యత్ లో మాస్ సినిమాలు తీయడం కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ సమస్యకు ప్రత్యామ్నాయాలుగా మన తెలుగు రచయితలు బూతులు రాకుండా కొత్త పదాలు సృష్టిస్తారేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: