ఛార్మి పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న జ్యోతిలక్ష్మి ముహూర్తపు షాట్ ఫోటోను చూసిన వారు షాక్ అవుతున్నారు. సామాన్యంగా ఒక సినిమా ఫస్ట్ షాట్ ను హీరో హీరోయిన్స్ పై కాని లేదంటే దేవుడు పటాల పై కాని తీస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ఛార్మీ వెనుక వైపును చూపెడుతూ నిలబడి ఉన్న పోజును ఫస్ట్ షాట్ గా ఎంచుకోవడం చూసి పూరీ పై సెటైర్లు పడుతున్నాయి.

ఒక సినిమా డాన్సర్ నిజమైన జీవితానికి సంబంధించిన కథ ఇది అని పూరి చెపుతూనే ఒకనాటి క్లబ్ డాన్సర్ జ్యోతి లక్ష్మి జీవితానికి ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నాడు. కేవలం పేరు క్యాచీగా ఉండాల‌ని ఈ టైటిల్ పెట్టాను అని అంటున్నాడు పూరి.

అయితే వరస పరాజయాల తరువాత ‘టెంపర్’ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన పూరి ఇటువంటి లేడీ ఓరియంటెడ్ సినిమాను ఎంచుకోవడం ద్వారా తప్పు చేస్తున్నాడు అనే మాటలు కూడా అప్పుడే మొదలు అయిపోయాయి.

ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక సూపర్ హిట్ వచ్చిన తరువాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకోకుండా ఇలాంటి ప్రయోగాలను హడావిడిగా చేస్తే తన కెరియర్ కు సంబంధించి పూరి జగన్నాథ్ భారీ మూల్యం చెల్లించు కోవలసి వస్తుంది అనే విశ్లేషణలు వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: