పవన్ ‘జనసేన’ పార్టీకి ఎన్నికల కమీషన్ నుండి అధికారిక గుర్తింపు వచ్చి చాలాకాలం అయినా పవన్ తన వ్యుహాత్మక మౌనాన్ని కొనసాగిస్తూ జనసేన పార్టీని ఇంకా జనం మధ్యకు తీసుకు వెళ్ళలేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిమిత్తం ఇప్పటి వరకు దాదాపు 25 వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ప్రకటనలు చేస్తున్నా ఇంకా తమ భూములను ప్రభుత్వానికి అధికారికంగా ఇవ్వలేదు అని రాజధాని నిర్మించ బోతున్న కొన్ని గ్రామాలలో రైతులు ఉద్యామాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

దీనితో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి రైతులకు మరికొన్ని వరాలు ఇవ్వడమే కాకుండా రైతులతో మాట్లాడటానికి తానే స్వయంగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ పరిస్థుతులలో ప్రస్తుతం రాజాధాని ప్రాంతంలో జరుగుతున్న రైతు ఉద్యామాలలో చాలామంది రైతులు ప్రతి పక్ష పార్టీలకు చెందిన జెండాలతో పాటుగా పవన్ ‘జనసేన’ పార్టీకి చెందిన జెండాలు పుచ్చుకుని కొందరు రైతులు కనిపించారు అని వార్తలు రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

దీనికి కారణం పవన్ ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో స్పష్టమైన కామెంట్లు చేసాడు కాని రాజధాని భూసేకరణ విషయం పై ఎటువంటి కామెంట్స్ చేయలేదు. దీనితో ‘జనసేన’ జెండాలతో హడావిడి చేసిన రైతులు పవన్ ను ఈ విషయం పై స్పందించమని సూచన ప్రాయంగా అడుగుతున్నట్లా? లేదంటే ఆ జెండాలు పుచ్చుకున్న రైతులు పవన్ వీరాభిమానులా? అన్న విషయం పై క్లారిటీ లేదు.

అయితే కోస్తా ప్రాంతంలోని చాల మంది రైతులు మాత్రం పవన్ రాజధాని పేరిట రైతుల వద్ద నుండి వేలాది ఎకరాలుగా తీసుకుంటున్న భూసమీకరణ విషయం పై కూడా స్పందిస్తే కోస్తా ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా జనంలోకి త్వరగా వెళ్ళే ఆవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషణలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: