నిరంతరం సంచల‌నాల‌కు చిరునామాగా ఉండే వర్మ తనలోని రచయిత కోణాన్ని బయటకు తీసి గతంలో రాసిన ‘నా ఇష్టం’ పుస్తకం సంచలనం సృష్టించింది. ఈ పుస్తకం సేల్స్ కూడా బాగా జరగడంతో ఆర్ధికంగా కూడా వర్మకు ఈ పుస్తకం ద్వారా కాసులు కురిసాయి అనే టాక్ ఉంది. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ వర్మ మరో పుస్తకం రాయడానికి శ్రీకారం చుట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ పుస్తకంలో ‘శివ’ సినిమా నుండి ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలలోని నటించిన హీరోలు హీరోయిన్స్ మనస్తత్వాలతో పాటు చాలామందికి సేలిబ్రెటీల విషయమై తెలియని విషయాలను బయట పెట్టి మరో షాక్ ఇవ్వడానికి వర్మ రెడీ అవుతున్నాడట. ఈ వార్తలు ఇలా ఉండగా వర్మ ఇక భవిష్యత్తులో చిన్న సినిమాలు తీయకుడదని నిశ్చయించుకున్నాడని టాక్.

ఇక ముందు తీసే సినిమాలు అన్నీ భారీ తారాగణంతో భారీ పెట్టుబడితో ఉంటాయట. అంతేకాదు ఇక దెయ్యం సినిమాల వైపు కూడా చూడను అంటున్నాడు వర్మ. ఈ విలక్షణ దర్శకుడు లేటెస్ట్ గా మంచు మనోజ్ తో తీస్తున్న ‘ఎటాక్’ మూవీ ధూల్ పేట బ్యాక్ డ్రాప్ తో రావడమే కాకుండా ఈ సినిమా ద్వారా మళ్ళీ పాత వర్మను చూస్తారు అని చెపుతున్నాడు.

ఈ మాటలు ఎలా ఉన్నా ఈ సినిమాలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ వడ్డే నవీన్ ల పాత్రలకు సంబంధించి ఇప్పటికే బయటకు వచ్చిన ఫోటోలను చూస్తూ ఉంటే నిజంగానే వర్మ పాత వర్మగా మారిపోతున్నాడా అని అందరికీ అనిపించడం సహజం..

మరింత సమాచారం తెలుసుకోండి: