ఒక డబ్బింగ్ సినిమా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ ‘టెంపర్’ కు సవాల్ విసిరింది అంటే ఎవరు నమ్మరు. అయితే అనూహ్యంగా అటువంటి పరిణామం నిన్న కోస్తా జిల్లాలలో జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘టెంపర్’ విడుదలై రెండు వారాలు దాటి పోవడంతో టెంపర్ కు కేటాయించిన ధియేటర్ లు అన్నీ చాల భాగం ఖాళీ అవ్వడంతో నిన్న డబ్బింగ్ చిన్న సినిమాల పండుగలా మారి దాదాపు నాలుగు సినిమాలు ఒకేసారి టాలీవుడ్ ప్రేక్షకుల పై దాడి చేసాయి.

‘భమ్ భోలేనాథ్’, ‘రామ్ లీలా’ వంటి స్ట్రైట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలైన ‘మగమహారాజు’, ‘పిశాచి’ సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఈ నాలుగు సినిమాలలో దెయ్యం సినిమాగా విడుదలైన ‘పిశాచి’ సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

నిర్మాత సి. కళ్యాణ్ కు ఈమధ్య దెయ్యం సినిమాలు బాగా కలిసి వస్తూ ఉండటంతో మంచి పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమాను ఈ వారం విడుదల చేసాడు. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ కోస్తా ప్రాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని ధియేటర్లలో ‘పిశాచి’ సినిమాకు ‘టెంపర్’ సినిమాకు మించిన కలెక్షన్స్ రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ చిన్న సినిమాల ప్రభావం ‘టెంపర్’ కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపెట్టదు అని భావించిన వారికి ఇది షాకింగ్ న్యూస్ అనుకోవాలి. ఇప్పటి దాకా ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లు వసూలు చేసిన ‘టెంపర్’ లాంటి భారీ సినిమాకు ఒక చిన్న డబ్బింగ్ సినిమా ‘పిశాచి’ ఊహించని షాక్ ఇవ్వడం ఆశ్చర్యం. దీనిని బట్టి చస్తూ ఉంటే నేటి యూత్ ఎటువంటి వెరైటీ సినిమాలు కోరుకుంటున్నారో అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: