పంజాబీ బ్యూటీ ఛార్మి తన లుక్ ను ఆకర్షణీయంగా మార్చు కోవడమే కాకుండా తన సినిమాల స్పీడ్ ను కూడా పెంచి అందరికీ షాక్ ఇస్తోంది. ఒక వైపు ‘జ్యోతి లక్ష్మి’ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరొక వైపు బడా సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఆదరగోడుతోంది. గతంలో నాగార్జునతో ‘ఢమరుకం’ సినిమాలో ‘ఏస్కో నా గుమా గుమా ఛాయ్’ అంటూ అదరగొట్టిన ఛార్మి మరొక టాప్ హీరోతో ఐటమ్ సాంగ్ చేయబోతోంది.

ప్రస్తుతం విక్రమ్ హీరోగా సమంత హీరోయిన్ గా నిర్మింప బడుతున్న ‘పత్తు ఎణ్రదుకుళ్ల’ సినిమాలో ఏకంగా 9 నిముషాలు ఉండే ఒక మాస్ మసాల సాంగ్ లో ఛార్మి విక్రమ్ సమంత లతో డాన్స్ చేయబోతోంది. ఈ పాట చిత్రీకరణ మొన్నటి నుంచి చెన్నైలో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు.

అయితే మంచి డాన్సర్ గా పేరున్న ఛార్మి స్టెప్స్ ముందు సమంత వేస్తున్న స్టెప్స్ తేలిపోతున్నాయి అంటూ ఆ సినిమా యూనిట్ కామెంట్ చేస్తోందని కోలివుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉంటే ప్రముఖ దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే టాలీవుడ్ లో అవకాశాలు తగ్గి కోలీవుడ్ లో టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటున్న సమంతకు ఈ ఐటమ్ సాంగ్ లో సమంత కన్నా ఛార్మి డామినేటింగ్ గా కనిపిస్తే అది సమంతకు అనుకోని షాకింగ్ న్యూస్ గా మారుతుంది. ఎలా చూసుకున్నా సమంతకు ఛార్మి దూకుడు అనుకోని షాక్ ఇచ్చింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: