జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏడాదికి ఒకటిరెండు చిత్రాలు చేసి సమాజ సేవ చేస్తానని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పార్టీని మళ్ళీ తెరపైకి తేలేదు. కానీ ఇప్పుడు ఆయన నటించే సినిమాల లిస్ట్‌ పెరిగిపోతుంది. ఈలోగా దాసరి, పవన్‌ కాంబినేషన్‌ అంటూ స్టేట్‌మెంట్‌ వచ్చేసింది. దీన్ని పవన్‌ ఖండించలేదు. కాగా, ఇప్పటికే ఆయన పలువురు దర్శకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

బాబీ ఓ కథను తయారుచేసుకుని ఎప్పటినుంచో వున్నాడు. అదిగో ఇదిగో అంటూ పవన్‌ డేట్స్‌ కోసం చూస్తున్నాడు. మార్చి ద్వితీయార్థంలో ఆ సినిమా వుండాలి. కానీ కొంతభాగాన్ని మార్చాల్సి వస్తుందని అందుకే జాప్యం జరుగుతుందని బాబీ సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. అది ఓకే అయితేనే గబ్బర్‌సింగ్‌-2గా అది తెరపైకి రాదు.

పవన్ కళ్యాణ్ ఇది కాకుండా త్రివిక్రమ్‌తో 'కోబలి' అనే చిత్రం చేయనున్నట్లు అత్తారింటికి దారేది తర్వాత ప్రకటించాడు. గోపాల గోపాల తర్వాత కూడా ఆ దర్శకుడు డాలీతో మరో సినిమా పవన్‌ చేస్తారని మాట ఇచ్చారని డాలీనే వెల్లడించారు. ఇదిలా వుండగా, 'సర్దార్‌' అనే టైటిల్‌ రిజిష్టర్‌ అయి వుంది. బహుశా దాసరి సినిమాకు అది చేశారని తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్‌ బేనర్‌లో అది రిజిష్టర్‌ అయింది. గతంలో చేగువేరా నేపథ్యంలో ఓ టైటిల్‌ రిజిష్టర్‌ చేశారు. కానీ అది వర్కవుట్‌ కాలేదు.

.-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: