తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడుగా గుర్తింపు పొంది ఆ తర్వాత అనూహ్యంగా హీరో అవతారం ఎత్తిన కామెడీ హీరో సునీల్. అసలు పేరు ఇందుకూరి సునీల్ వర్మ. ఇతడు భీమవరం లో జన్మించాడు. తండ్రి కేం ద్ర తపాలా శాఖా ఉద్యోగి. సునీల్‌కు ఐదేళ్ళ వయసు అప్పుడు తండ్రి మరణించగా తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన పెదపులివర్రులో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత భీమవరం వచ్చేశాడు.

తొమ్మిదో తరగతికిఉండి ఉన్నత పాఠశాల లో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక ప్రధాన నటుడిగా, మరియు మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకొన్నాడు. సునీల్ ప్రఖ్యాత రచయిత, దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ మంచి స్నేహితులు. సునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహమే. వీరిద్దరికీ ఒక పాప. పేరు కుందన. అంతే కాదు సునీల్ తన శరీర సౌష్టవాన్ని కూడా ఆకర్షనగా అంటే సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడు. తాజాగా సునీల్ దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు‌. ఈ స్థితిలో మ‌రో సినిమా స్టార్ట్ అయ్యింది. సునీల్‌ హీరోగా ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది.

ఈ చిత్రానికి మోక్ష చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన వంశీ కృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. సునీల్ నుంచి ప్రేక్ష‌కులు కోరుకొనే అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉంటాయ‌ని చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ అంటున్నారు. ఇది వంద శాతం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర‌ని చిత్ర యూనిట్ తెలుపుతోంది.

ఫిబ్రవరి 28వ తేది సునీల్ పుట్టిన రోజు కావడంతో ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, సునీల్ ఇలానే చేతి నిండా సినిమాల‌తో ఈ యేడాదంతా బిజీ బిజీగా ఉండాల‌ని, మ‌రిన్ని మంచి సినిమాలు అందించాల‌ని కోరుకుంటున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: