టాలీవుడ్ హీరోలు అందరు క్రేజీ బ్యూటీల వెంటపడుతుంటే మళయాళ సూపర్ స్టార్లు తెలుగు హీరోయిన్స్ వైపు చూడటం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు సినిమా రంగం ఎప్పుడో మర్చిపోయిన అర్చనతో ఒక సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం కలిగించాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా అంజలి వంతు వచ్చింది. తెలుగు సినిమాలలో అవకశాలు లేకపోయినా తమిళ సినిమాలను ప్రస్తుతం వరస పెట్టి ఒప్పుకుంటోంది ఈ తెలుగు తెర సీతమ్మ. తాజాగా మలయాళ టాప్ హీరో మమ్ముట్టి సరసన నటించే బంపర్ ఆఫర్ అంజలి కొట్టేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్ డైరెక్టర్ రామ్ అంజలిని దృష్టిలో పెట్టుకుని ఒక యదార్ధ సంఘటనను ఆధారంగా చేసుకుని ఒక స్క్రిప్ట్ ఒకటి తయారు చేసాడు. అయితే ఆ కథలో హీరోగా నటించే వ్యక్తి పాత్ర మధ్య వయస్కుడు కావడంతో ఆ పాత్రకు సరిపోయే నటులు ఎవరు అన్న తర్జనభర్జనలు జరిగాయి.

అయితే అనుకోకుండా ఈ దర్శకుడు మళయాళ టాప్ హీరో మమ్ముట్టిని కలిసి ఈ కథను వివరించడంతో ఈ స్క్రిప్ట్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా ఉన్నా, కథ నచ్చడంతో మమ్ముట్టి తను ఆ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చాడని తెలుస్తోంది. మమ్ముట్టి లాంటి టాప్ హీరోతో నటించే అవకాశం రావడంతో అంజలి ప్రస్తుతం మంచి జోష్ మీద ఉందని టాక్. వాస్తవ కథలను సినిమాలుగా తీస్తే బాగా ఆదరించే మళయాళ ప్రేక్షకుల దృష్టిలో అంజలి పడటం అంజలి కెరియర్ ఒక టర్నింగ్ పాయింట్ అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: