దేశంలో స్వైన్ ఫ్లూ ఏ రకంగా విజృంభిస్తుందో అందరికీ తెలుసు. ఈ వ్యాధి సాధారణంగా చల్లని వాతావరణంలో, పరిసరాల అపరిశుభ్రతగా ఉన్నా, ఎవరైనా తుమ్మినా, దగ్గని వచ్చే తుంపర్ల ద్వారా లేదా పందులను కుట్టిన దోమల ద్వారా రక రకాలుగా వ్యాప్తి చెందుతుంది. దీని లక్షణాలు తీవ్ర జ్వరం, విపరీతమైన దగ్గు, తుమ్ములు రావడం.

దీనికి చిన్నా పెద్ద పేద ధనిక తారతమ్యాలు లేవు. దీని భారిన డాక్టర్లే పడుతున్నారంటే ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోండి. విషయానికి వస్తే... హీరో అనీల్ కపూర్ కూతురు యువ నటి సోనమ్ కపూర్ కి స్వైన్ ఫ్లూ సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె రాజ్ కోట్ లోని స్టెర్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఓ సినిమా షూటింగి కోసం గుజరాత్ వెళ్లిన సోనమ్ కపూర్ అక్కడి వాతావరణం పడక దగ్గు, తీవ్ర జ్వరం వచ్చిందట దీంతో అక్కడ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయగా ఆమెకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని తెలిపారట ఇంకేముంది షూటింగ్ సంగతి దెవుడెరు వెంటనే మెరుగైన చికిత్సకోసం తిరుగు ప్రయాణం కట్టింది. ఇదే షూటింగ్ లో సల్మాన్ ఖాన్, అనుప్ ఖేర్ కూడా ఉన్నారు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: