కథలు వ్రాసే విషయంలోనే కాదు ఆ కథలను సినిమాలుగా తీసే విషయంలో చాల స్పీడ్ గా ఉంటాడు పూరి జగన్నాథ్. అంతేకాదు ఒకసారి పూరి కథ చెప్పిన తరువాత ఆ కథలో సినిమా తీస్తున్నప్పుడు పెద్దగా మార్పులు కూడా చేయడు. అందువల్లనే పరిస్థితులు అనుకూలిస్తే సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీసే సమర్ధత కూడా పూరీకి ఉంది. ఈ నేపధ్యంలో పూరీకి సంబంధించిన ఒక ఆ శక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.

త్వరలో వరుణ్ తేజ్ తో సినిమాను తీయబోతున్న పూరి ఆ సినిమా కోసం తాను ఎప్పుడో చిరంజీవి కోసం రిజిస్టర్ చేయించుకున్న ‘ఆటో జాని’ టైటిల్ ను బయటకు తీస్తున్నాడని టాక్. గతంలో వరుణ్ తేజ్ మొట్టమొదటి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తుంది అనే వార్తలు వచ్చినప్పుడు పూరి అప్పటికే తాను తయారు చేసుకున్న ‘హార్ట్ ఎటాక్’ సినిమా కథను వరుణ్ తేజ్ కు నాగబాబుకు వినిపించాడని వార్తలు వచ్చాయి.

అయితే అప్పట్లో ఆ కథ నాగబాబుకు నచ్చక పోవడంతో అదే కథను నితిన్ ను హీరోగా పెట్టి పూరి ‘హార్ట్ ఎటాక్’ సినిమాను తీసి ప్రేక్షకులకు ‘హార్ట్ ఎటాక్’ తెప్పించాడు. ప్రస్తుతం మళ్ళీ అదే సీన్ రిపీట్ కాబోతోంది అని అంటున్నారు. వరుణ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టినా త్వరలోనే మరో సినిమా పూరి జగన్నాథ్ తో చేయబోతున్నాడు.

ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాకు పూరి ఎప్పుడో చిరంజీవి కోసం రాసుకున్న ‘ఆటో జాని’ కథను కొద్దిగా మార్పులు చేసి వరుణ్ తేజ్ తో అదే టైటిల్ తో సినిమాగా తీస్తాడట. తయారు చేసుకున్న కథను వృధా చేయకుండా ఏ హీరోకైనా సరిపెట్టగల సమర్ధత ఉంది కాబట్టే పూరి ఇన్ని సినిమాలు తీయగలుగుతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: