ఎన్నో భారీ అంచనాలతో సంక్రాంతికి విడుదలైన పవన్ వెంకటేష్ ల ‘గోపాల గోపాల’ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నా సామాన్య ప్రేక్షకుల స్థాయికి చేరుకోలేక పోవడంతో నిన్నటితో ఆ సినిమా 50 రోజుల ముచ్చట ఇరు రాష్ట్రాలలోను కేవలం 5 సెంటర్లలో మాత్రమే 50 రోజుల పోస్టర్ వేయించు కోవడం పవన్ అభిమానులను నిరాశ పరిచింది.

ప్రస్థుత వాతావరణంలో ఒక సినిమా నెలరోజులు ప్రదర్శింప బడటం రికార్డుగా భావిస్తున్న నేపధ్యంలో పవన్ వెంకీల ‘గోపాల గోపాల’ సినిమాకు ఇది పెద్ద రికార్డు అని అభిమానులు సరి పెట్టుకుంటున్నా లోలోపల మాత్రం వారిలో తీవ్రమైన బాధ ఉంది అని టాక్. నిన్నటితో ఈ సినిమా వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, కరీమ్ నగర్ సెంటర్లలో మాత్రమే 50 రోజులు ప్రదర్శింపగలిగింది.

ఈ సినిమా ఈ స్థాయిలో తక్కువ విజయాన్ని నమోదు చేసుకోవడం టాలీవుడ్ కు షాకింగ్ గా మారింది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు లాభాలు వచ్చినా ఈ సినిమాను భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు మాత్రం చాల వరకు నష్టపోయారు అనే వార్తలు ఉన్నాయి.

తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తీద్దామని నిర్మాతలు ప్రయత్నించినా పవన్, వెంకటేష్ ల భారీ పారితోషికాలు ఈ సినిమా బడ్జెట్ ను పెంచేసాయి అని అంటారు. పారితోషికాల విషయంలో చుక్కలు చూపించే టాప్ హీరోలు తమ సినిమాల కలక్షన్స్ విషయంలో బయ్యర్లకు సహాయ పడలేకపోతున్నారు అని అనిపించే మరో ఉదాహరణ ‘గోపాల గోపాల’ కథ..

మరింత సమాచారం తెలుసుకోండి: