శృంగార తార సన్నీలియోన్ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకు బయటకు రాని కొన్ని విషయాలను ఒక డాక్యుమెంటరీ బయట పెట్టబోతోంది. డాక్యుమెంటరీ సినిమాలు తీయడంలో ప్రసిద్ధిగాంచిన బాలీవుడ్ డాక్యుమెంటరీ నిర్మాత దిలీప్ సన్నీ లియోన్ పై తీస్తున్న డాక్యుమెంటరీలో ఇప్పటి వరకు చాల మందికి తెలియని విషయాలు ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి అని చెపుతున్నారు.

ఒక కెనడియన్ సంస్థ సన్నీ జీవితం పై ఆ శక్తికలిగి రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీలో సన్నీ అదేవిధంగా ఆమె భర్త డానియల్ వారి జీవితాలకు సంబంధించిన యదార్ధ సంఘటనలను ఎటువంటి మొహమాటం లేకుండా ఈ డాక్యుమెంటరీ నిర్మాత దిలీప్ కు తెలియచేయడం షాకింగ్ గా మారింది అని దిలీప్ అంటున్నారు.

దీనితో ఈ డాక్యుమెంటరీ ఆమె జీవితం పై తెరిచిన పుస్తకంగా మారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం అని ఈ డాక్యుమెంటరీ నిర్మాతలు అంటున్నారు. ఇక ఈ వార్తలు ఇలా ఉండగా సన్నీ నటించిన ‘ఏక్ పహెలీ లీలా’ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, వేడెక్కించే నృత్యగీతం ఇప్పటికే ‘యూ’ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

తాజాగా విడుదలైన ఆ చిత్రంలోని ఒక శృంగార గీతం వాటన్నిటినీ మించి ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ పాటలో సాంప్రదాయికమైన సల్వార్ సూట్లలో కనిపిస్తూనే సన్నీ అందరినీ అకర్షిస్తోంది. పునర్జన్మ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను యూ ట్యూబ్‌లో చూసినవారి సంఖ్య ఇప్పటికే కోటి దాటడం టాపిక్ ఆఫ్ బాలీవుడ్ గా మారింది...

మరింత సమాచారం తెలుసుకోండి: