అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కోలీవుడ్ ను షేక్ చేయడానికి ఒక కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘కార్తికేయ’ లాంటి వెరైటీ సినిమాను తీసిన చెందు మొండేటి యాక్షన్ ప్లాన్ లో నాగచైతన్య చిక్కుకున్నాడు అని టాక్. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ యువ దర్శకుడు చెప్పిన కథ చైతూకు బాగా నచ్చడంతో ఈసారి కొత్త వ్యూహం తయారైంది అని అంటున్నారు.

ఈమధ్యనే చైతన్యను కలిసిన, చెందు మొండేటి చెప్పిన ఒక థ్రిల్లర్ కథ లైన్ చైతన్యతో పాటు నాగార్జునకు కూడా బాగా నచ్చడంతో ఈ సినిమాను నాగ్ స్వయంగా నిర్మించడానికి పూనుకున్నాడు అని టాక్. తండ్రి కొడుకుల అనుబంధం నేపధ్యంలో సాగే ఈ కథ ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతుంది.

అయితే ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడ తీస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో అనేకమంది యంగ్ హీరోలు ఉన్నా చాలామందికి మాస్ లుక్ ఉండటంతో క్లాసు లుక్ తో కనిపించే హీరోలు తక్కువగా ఉండటంతో చైతన్యను కోలీవుడ్ ఎంట్రీ ఈ సినిమా ద్వారా ఇప్పించడం ద్వారా ఆలోటును పుడ్చాలని నాగ్ ప్లాన్ అని అంటున్నారు.

చిన్న తనం నుండి చైతన్య చెన్నైలో పెరగడంతో అక్కడ తమిళ భాష పై పూర్తిగా పట్టు ఉండటంతో చైతూకు కోలీవుడ్ ఎంట్రీ సులువుగా సక్సస్ అవుతుంది అన్న ప్లాన్ అక్కినేని కుటుంబం వేస్తోందని టాక్. అయితే చైతన్యను కోలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నదే సందేహం..

మరింత సమాచారం తెలుసుకోండి: