దర్శకరత్న దాసరి నారాయణరావు నిన్న ప్రముఖ ఎస్వీ. రంగారావు జీవితం పై జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చేసిన కామెంట్స్ కొన్ని జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసే విధంగా ఉండటం చాలామందిని ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం చాలామంది టాప్ దర్శకులు తమ సినిమాలలో నటిస్తున్న హీరోల బాడీ లాంగ్వేజ్‌ను బట్టి కథలు తయారు చేసుకుంటున్నారని ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు దాసరి.

తాము నటించే సినిమాలకు పాత్రలకు అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న నటులు మాత్రమే చరిత్రలో మిగులుతారని లేదంటే ‘టైగర్లు’ అని పిలిపించుకున్నంత మాత్రాన హీరోలు చరిత్రలో ఉండరని వ్యాఖ్యానించారు దాసరి. అంతేకాదు సినిమా రంగ చరిత్ర సరిగ్గా తెలియాక రాబోయే తరంవారు ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ నే రియల్ ఎన్టీఆర్ అనుకునే ప్రమాదం ఉందని అందువల్ల సినిమారంగ ప్రముఖులచరిత్ర పై పరిశోధనలు జరగాలని వ్యాఖ్యానించారు దాసరి.

నిన్నటి తరం నటుడు కాంతారావుకు గొప్ప చరిత్ర ఉంది అని అంటూ అటువంటి చరిత్ర గల హీరోలను రాబోయే రోజులలో జనం మరిచిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు దాసరి. సావిత్రి, ఎస్వీఆర్, కైకాల సత్యనారాయణ లాంటి మహానతులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులతో సత్కరించక పోవడం దారుణం అన్నారు దాసరి.

ప్రస్థుతం సినిమా రంగం కొందరు ప్రముఖ వ్యక్తుల చేతిలో కబ్జా చేయబడిందని అదేవిధంగా తెలుగు సినిమా రంగ చరిత్ర కూడా కబ్జా చేయబడుతుందా అన్న భయం తనకు కలుగుతోందని వ్యాఖ్యా నించారు దాసరి. అందుకే కాబోలు దాసరి నిర్మాతగా మారి పవన్ తో సినిమాను తీస్తూ ఈ కబ్జా దారులకు సమాధానం ఇస్తున్నారు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: