పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగింది అంటూ తన రాజకీయ స్పీడ్ ను పెంచుతూ సంచలనాలు సృష్టిస్తూ ఉంటే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పవన్ మార్గాన్నే అనుసరిస్తోంది. అయితే ఈమె మరో విధంగా మొన్న ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే రకరకాల పన్నులతో బాధ పడిపోతున్న ప్రజల పై సర్వీసు ట్యాక్స్ పెంచడం పై వెరైటీగా స్పందించింది రేణు దేశాయ్.

రానున్న రోజులలో ప్రభుత్వాలు తమ ఆదాయం పెంచుకోవడం కోసం ‘డెత్ ట్యాక్స్’ పేరుతో చనిపోయిన వారి శవ పేటికల పై కూడ పన్నులు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ సెటైర్లు వేసింది రేణు. ఇంటి పన్ను, ఎలట్రసిటీ పన్ను, నీటి పన్ను, రోడ్డు ట్యాక్స్ ఇలా కనిపించిన ప్రతి వాటిపైన పన్నులు వేస్తూ జనం నడ్డి విరుస్తున్నారని బాధ పడుతోంది రేణు.

ధనవంతులు సూపర్ రిచ్ ధనవంతులుగా పెరిగిపోతున్నా వారి పెరుగు దలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న ప్రభుత్వాలు సామాన్యుడికి మాత్రం రోజురోజుకు తమ పన్నులతో దిగాజారుస్తున్నాయని కామెంట్ చేసింది రేణు.

తాను 18 సంవత్సరాలుగా రకరకాల ఆస్థి ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నా తనకు వ్యక్తిగతంగా ప్రభుత్వం నుండి అందిన సహాయం ఏమిటో ఇప్పటికీ తనకు అర్ధం కాని పజిల్ గా మారిపోయింది అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే రేణు మాటలే కాదు జనం మాటలే పట్టించుకునే స్థాయిలో లేవు మన ప్రభుత్వాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: