విలక్షణ నటుడు మోహన్‌బాబు కుటుంబం మంచు మనోజ్ పెళ్ళి నిశ్చితార్ధ వేడుకలలో బిజీగా ఉన్నారు. ఈనెల 4న ఎల్లుండి మంచు మనోజ్ నిశ్చితార్ధ వేడుక వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటకే మోహన్ బాబు ఈ నిశ్చితార్ధ వేడుకులకు రావలసిందిగా ఆహ్వానిస్తూ భాగ్య నగరంలోని అన్ని వర్గాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నాడు.

అయితే మనోజ్ కు కాబోయే భార్య ప్రణితకు సంబంధించిన ఫోటో ఇప్పటివరకు బయటకు రాలేదు. దీనితో మనోజ్ తాను పెళ్ళాడే యువరాణి ఈమెనంటూ పరిచయం చేయడమే కాకుండా ‘నా దేవత’ అంటూ పెద్ద డైలాగులతో ఈ మంచు హీరో తన భార్య ఫోటోను తన పేస్ లో పెట్టి హడావిడి చేస్తున్నాడు.

ఇక మోహన్ బాబు అయితే నా మూడో కుమార్తె ఈమె అంటూ మోహన్‌బాబు తన రెండవ కోడలి ఫోటో‌ను సోషల్ నెట్‌వర్క్స్ సైట్స్ ద్వారా పరిచయం చేసాడు. మనోజ్ తన ‘పోటుగాడు’ మూవీలో హిట్ సాంగ్ ‘దేవత’ ను తన కాబోయే భార్య ప్రణీత రెడ్డికి ట్యాగ్‌లైన్ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

మంచు విష్ణు భార్య విరోనికాకు ఫ్యామిలీ ఫ్రెండ్ గా అమెరికాలో సిఎ చేసిన ప్రణీత‌తో రెండేళ్ళ క్రితమే మనోజ్ ప్రేమలో పడి పెద్దల అనుమతితో త్వరలో పెళ్ళి పీటలు ఎక్క బోతున్న నేపధ్యంలో ఈ సంవత్సరం తనకు అన్ని విధాల కలిసి వస్తుందని ఆశిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: