తన అందాలతో ఇటు తెలుగు ఇండస్ట్రీని, అటు తమిళ ఇండస్ట్రీని ఒక్క ఊపు ఊపుతూ మూడు పదుల వయస్సులో కూడా మాంచి ఫిట్ నెస్ తో కూడిని ముద్దుగుమ్మ అనుష్క. ఈమధ్య రుద్రమదేవి' చిత్రానికి సంబంధించిన 3డి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రముఖుల కోసం ప్రసాద్ లో ప్రదర్శించారు.

త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్ తెలిపారు. గుణశేఖర్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్బంగా అనుష్కమాట్లాడుతూ ఇలాంటి సినిమాల్లో నటించడం నా అదృష్టమని ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని తెలిపింది.

ఈ సినిమా తీయడానికి గుణశేఖర్ ఎంతగా కష్ట పడుతున్నారో తనకు తెలుసు అని సినిమా తప్పకుండా ఘన విజయం సాధించాలని కోరారు. ‘దాదాపు పదేళ్లు కష్టపడి గుణశేఖర్ గారు ఈ కథ రెడీ చేసారు. ఈ సినిమాలో ఆయన ఫ్యాష్, హార్డ్ వర్క్ చూడొచ్చు. అల్లు అర్జున్, రానాకి స్పెషల్ థాంక్స్. వాళ్లు ఈ పాత్రలు ఒప్పుకుని చేయడం చాలా గ్రేట్' అని అనుష్క వ్యాఖ్యానించారు.

గుణశేఖర్ మాట్లాడుతూ 13వ శతాబ్దానికి చెందిన ఎపిసోడ్ ఇది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్‌కి ఇవ్వడానికి చాలా కష్టపడ్డాం. ఈ 3డి ట్రైలర్ ఓ మచ్చుతునక మాత్రమే. త్వరలోనే సినిమా విడుదల చేస్తున్నాం' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: