ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ కార్యక్రమంలో నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆ శక్తి దాయకంగా ఉన్నాయి. తన తండ్రి చాల పెద్ద వ్యాపారవేత్త అని తన తండ్రికి చాల పెద్ద ఫౌల్ట్రీ బిజినెస్ ఉంది అని చెపుతూ తనకు అప్పు ఇవ్వడానికి ఫైనాషియర్స్ ఎందుకు భయపడతారు అని ఎదురు ప్రశ్నలు వేసాడు బండ్ల గణేష్.

అంతేకాదు తాను ఏరాజకీయ నాయకుడికి బినామీని కాదని కేవలం పెద్ద హీరోలతో మాత్రమే తాను సినిమాలు తీస్తూ ఉండటంతో తనపై అసూయతో ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని అభిప్రాయ పడ్డాడు గణేష్. తనకు అప్పులు ఉన్న మాట వాస్తవమే అనీ తన పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ కు కేవలం 50 లక్షల అప్పు ఉంటే అది కొట్లలో చూపెడుతూ తన పరపతిని కొందరు దెబ్బ తీస్తున్నారని కామెంట్స్ చేసాడు ఈ బ్లాక్ బస్టర్ నిర్మాత.

సినిమా రంగంలో పెద్ద హీరోలతో పరిచయాలు ఉండి వాళ్ళ డేట్స్ సంపాదించ గలిగితే అప్పు అదే పుడుతుందని అభిప్రాయ పడ్డాడు ఈ నిర్మాత. తాను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలతో అలాగే ఏ హీరో మంచి క్రేజ్ లో ఉంటే ఆ హీరోతో క్లోజ్ గా ఉండడం తన వ్యాపార సీక్రెట్ అంటూ అసలు విషయం బయట పెట్టాడు. తాను నిజంగానే ఒక మంత్రికో లేదా మరో పెద్ద వ్యక్తికో బినామి అయితే తనకు అప్పులు ఎందుకు ఉంటాయి అని ఎదురు ఆ మీడియా ప్రతినిధికి ఎదురు ప్రశ్న వేసాడు.

బండ్ల గణేష్ ఒక ప్రముఖ వ్యక్తికి బినామి అన్న విషయం నిజమో కాదో తెలియక పోయినా తన వ్యాపార రహస్యాన్ని ఇంత ఓపెన్ గా మీడియా సాక్షిగా తెలియచేయడం సాహసమే అనుకోవాలి. జూనియర్ గురించి, పూరి గరించి గతంలో తన పై వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే అంటూ ఒక్క మాటలో తేల్చేసాడు ఈ తెలివైన నిర్మాత. టాప్ హీరోల డేట్స్ మేనేజ్ చేయడంలోనే కాదు మీడియాను మేనేజ్ చేయడంలో కూడా బండ్ల గణేష్ తీరు విభిన్నం..

మరింత సమాచారం తెలుసుకోండి: