తెలుగు ఇండస్ట్రీలో ఆజానుభాహుడిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ప్రభాస్ ఇప్పటికే పాపులర్ అయ్యాడు. మరి తన తోటి వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి మరి ప్రభాస్ పెళ్లెప్పుడా అని అందరూ అనుకుంటున్నారు. నిజమే ఈ ఆలోచన ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజుకు కూడా వచ్చింది.

అంతే ఆఘమేఘాల మీద పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రభాస్ కి అప్పటికే పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ‘బాహుబలి’ ప్రాజెక్టు అడ్డు వచ్చిందట. దీంతో ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా పడుతూ వస్తుందట.

మొత్తానికి బాహుబలి సినిమా పూర్తయ్యింది మరి ఇక మనోడికి పెళ్లి చేయ్యడమే తరువాయి అంటున్నారు ఇంటి పెద్దలు. మొదటి నుంచి ప్రభాస్ కెరీర్ ను చూసుకుంటున్న కృష్ణం రాజు ఈ డిసెంబర్ లో పెళ్లి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారట..? అంతే కాదు ఆ మధ్య ఆయనకు ఆరోగ్యం కూడా కాస్త సహకరించలేదని ప్రస్తతం బాగానే ఉందని చెబుతున్నారు.

మరి యంగ్ రెబల్ స్టార్ ఓ ఇంటి వాడైతే మరి ఆ వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితోనా లేదా రాజకీయ రంగానికి చెందిన వారి అమ్మాయితోనా ? ఎవరో ఆ అదృష్ట వంతురాలు అని తెలుగు ఇండస్ట్రీ ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: