పవన్ తన సినిమాలతో, రాజకీయ ఎత్తుగడలతో హడావిడిగా ఉంటే పవన్ పిల్లలు మాత్రం తమ తల్లి దగ్గర కుక్క పిల్లల హంగామాలో బిజీగా కాలం గడుపుతున్నారు. పూణేలో రెండు రోజుల క్రితం భారీ వర్షం పడింది ఆ వర్షాన్ని పవన్ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆ వానకు వర్షంలో తడిసి పోతూ వణుకు తున్న కొన్ని కుక్క పిల్లలను చూసి పవన్ కొడుకు అకిరా నందన్ కూతురు ఆద్య చేసిన హడావిడి ఫోటోలు ఇప్పుడు వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

భోరున కురుస్తున్న వాన మధ్య తడిచిపోతున్న ఆ పప్పీలను పవన్ పిల్లలు తమ ఇంటి నుండి తీసుకు వచ్చిన గొడుగు మధ్యకు తీసుకు రావడమే కాకుండా వాటిని తమ ఇంటిలోని షెల్టర్ లోకి తీసుకు వెళ్లారట. ఈ విషయంలో పవన్ పిల్లలకు రేణు దేశాయ్ కూడా సహాయ పడ్డానని చెపుతోంది. అంతేకాదు ఆ విషయానికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ లో షేర్ చేసింది.

ప్రస్తుతం రేణు దేశాయ్ పవన్ కొడుకును టాలీవుడ్ కు పరిచయం చేయడానికి తాను తీసిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదలచేసే కార్యక్రమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లే కనిపిస్తోంది. దీనికి కారణం ఈ సినిమాలో అతిథి పాత్రలో పవన్ కొడుకు ఉన్నా బయ్యర్ల నుండి ఎటువంటి స్పందన లేకపోవడమే కారణం.

అయినా ఆ విషయాలేమి పట్టించుకోకుండా రేణు దేశాయ్ వీలైనప్పుడల్లా పవన్ నామ స్మరణ కొనసాగిస్తూ ఎదో వంకన ఎదో కారణంతో పవన్ అభిమానుల దృష్టిలో తాను పడడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. పవన్ మాత్రం గోపాలుడు లాగే ఏమి పట్టనట్లు తన పనిలో తాను బిజీగా ఉంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: