బుల్లితెరపై యాంకర్స్ అంటే మహా క్రేజీ అందునా మన తెలుగు బుల్లితెరపై యాంకర్లకు కొదవే లేదు. సుమ, ఝాన్సీ,ఉదయభాను,అనసూయ,రేష్మి ఇదే కోవలోకి వస్తుంది శిల్పా చక్రవర్తి. ఈ అమ్మడు ముద్దు ముద్దు మాటలతో యాంకరింగ్ భలే చేస్తుంది. వాస్తవానికి శిల్పాకు మొదట్లో తెలుగు వచ్చేది కాదు పట్టుబట్టి తెలుగు నేర్చకొని మంచి యాంకర్ గా సెటిల్ అయ్యింది.

అంతే కాదు వెండితెరపై కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. అయితే ఈ అమ్మడి ప్రేమ కోసం ఇద్దరు యువకులు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నారట. హలో..! ఇది జరిగి చాలా రోజులైందట శిల్పా చక్రవర్తి మాటల సందర్భంగా తన మనసులో మాట చెప్పింది.

తను కాలేజీ చదివే రోజుల్లో ఇద్దరు యువకులు తన ప్రేమో పొందాలని పోటా పోటీగా ప్రయత్నించేవారట అంతేనా ఒకరోజు కాలేజీ గ్రౌండ్లో విపరీతంగా కొట్టుకున్నారట కాలేజీ యాజమాన్యం వచ్చి వారిద్దరిని ఆపి బుద్ది చెప్పి పంపించారట.

అంటే అమ్మడు కాలేజీ రోజుల్లోంచి కుర్రకారు మతులు పోగొడుతూ వస్తుందన్నమాట. ఇంతకీ వారద్దరిలో ఎవరినైనా ప్రేమించిందా అంటే నో... ఎవ్వరినీ ప్రేమించలేదు... పెళ్లి చేసుకోలేదు. ఏమైనా ఇద్దరి మతులు పోగ్గొట్టి తాను మాత్రం యాంకరింగ్ చేస్తుంది అమ్మో శిల్పా..

మరింత సమాచారం తెలుసుకోండి: