తమిళ సినిమా రంగంలో రజినీకాంత్ తర్వాత ఆ స్థాయికి కాకపోయినా తన కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు హీరో అజిత్. కోలీవుడ్ లో టాప్ హీరోగా మంచి హిట్లు సాధిస్తున్న అజిత్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. దీనికి కారణం అజిత్ ఇంట వారసుడు వచ్చాడు. అదేనండీ..! అజిత్, షాలిని దంపతులకు పండంటి బిడ్డ పుట్టాడు. వీరిద్దరు కలిసి తొలిసారిగా 1999లో అమర్కలం సినిమాలో నటించారు.

షాలిని బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాలు చేసింది. సఖి సినిమాతో హీరోయిన్ గా వచ్చి రెండో సినిమా అమర్కలం సినిమా చేసింది అదే సినిమా హీరో అజిత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. విరికి మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది. అమ్మాయి తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నారు.

షాలినికి ఈ రోజు ఉదయం 4.30 గంటలకు బిడ్డ పుట్టాడు.కోలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకెళ్తున్న అజిత్ ఇంట్లో వారసుడు రంగప్రవేశం చేసినట్టే. అజిత్‌కు ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు ఫోన్లు చేసి వారసుడు పుట్టినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అజిత్ తాజా చిత్రం ఎన్నై అరిందాల్(తెలుగులో ఎంతవాడు గానీ) కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోలీవుడ్ రూ.60 కోట్ల షేర్‌తో పాటు ఓవర్సీస్‌లో రూ.25 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: