గమ్యం, వేదం సినిమాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఈ దర్శకుడు రూపొందించిన కొత్త సినిమా కృష్ణం వందే జగద్గురుమ్.  ఈ సినిమాలో దుగ్గుబాటి రానా హీరోగా మరో విశేషం. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. మణిశర్మ స్వరపరిచిన పాటలు ఇటీవలే మార్కెట్ లోకి వచ్చాయి.  ఈ పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం..! ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. కృష్ణం వందే జగద్గురమ్ థీమ్ మ్యూజిక్ ను కూడా పొందు పరిచారు. 1. అరె పసి మనసా... నరేంద్ర, శ్రవణ భార్గవి గానం చేసిన ఈ పాటను సీతారామశాస్ర్తి రచించారు. హీరో, హీరోయిన్ ను టీజ్ చేసి విధంగా ఈ పాట సాగుతుంది. సీతరామశాస్ర్త్తి శైలీలో సాగే ఈ పాట ఆహ్లదంగా సాగుతుంది. 2. సై అందిరా నాను... శ్రేయా గోషల్, రాహుల్ సిప్లి, దీపు గానం చేసిన ఈ పాటను ఈ.ఎస్.మూర్తి రచించారు.  ఐటెం సాంగ్ గా సాగే ఈ పాట వెంకటేష్ అభిమానులను కూడా దృష్టిలో  పెట్టుకుని సాగే విధంగా రాసారు. 3. జరుగుతున్నది జగన్నాటకం.... ఎస్పీ బాలసుబ్రమణ్యం గానం చేసిన ఈ పాటను సీతారామశాస్ర్తి రచించారు. సుమారు 10 నిమషాలు సాగే ఈ పాట విష్ణుమూర్తి దశావతారాల గురించి సాగుతుంది. సాధారణంగా విష్ణుమూర్తి దశావతారాల  పాట అనగానే ఆయా అవతారాల గురించి వర్ణన ఉంటుంది. అయితే ఈ పాటలో ఆయా అవతారాల అంతర్థాం గురించి వివరించడానికి ప్రయత్నించారు. 4. స్పైసీ స్పైసీ గ్లర్.... సీతారామశాస్ర్తి రచించిన ఈ పాటను హేమ చంద్ర, చైత్ర, శ్రావణ్ భార్గవి గానం చేశారు. ఈ ఆల్బమ్ లో ఈ పాట కొంచె స్పీడ్ గా సాగుతుంది. 5. రంగ మార్తండ బి.టెక్ బాబు.. రఘుబాబు, హేమచంద్ర,  సాయి మాధవ్ బుర్రా గానం చేసిన ఈ పాటను సాయి మాధవ్ బుర్రా గానం చేశారు. హీరో పరిచయ పాటగానూ, హీరో గురించి చెప్పే పాట గాను వినిపిస్తుంది. ఈ పాటలో వెంకటేష్ పాత సినిమా పాటల బాణీలు ఉండటం విశేషం. 6. చల్ చల్ చల్ జోమ్న గానం చేసిన ఈ పాటను సాయి మాధవ్ బుర్రా రచించారు. హీరోయిన్ మీద సాగే పాటలా అనిపిస్తుంది. మ్యూజిక్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: