సీనియర్ హీరోల దగ్గర నుంచి టాప్ యంగ్ హీరోల వరకు ఒకే రకం పాత్రతో కూడిన సినిమాలు చేసినా ఆ పాత్రలో తమ అభిమాన హీరో ఒదిగి పోతూ చేసిన నటనకు ఫిదా అయిపోయి ప్రేక్షకులు కోట్ల కలెక్షన్స్ వర్షాన్ని కురిపించిన ఒకే ఒక్క పాత్రలో మటుకు ఎంతమంది నటించినా మన తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు బోర్ ఫీల్ అవ్వలేదు. అదే పోలీసు పాత్ర.

సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజాలు పోలీస్ లుగా కనిపిస్తే వారి అభిమానులు కోట్లను కురిపించి రికార్డులను క్రియేట్ చేసేలా సహకరించారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో నటించని ప్రభాస్ కు ఈ పాత్ర పై అమితమైన మోజు పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘బాహుబలి’ విడుదల తరువాత ప్రభాస్ హీరోగా సెట్స్ పైకి వెళ్ళబోతున్న లేటెస్ట్ సినిమా ఒక పోలీస్ స్టోరి అని అంటున్నారు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తన మాస్ ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి ప్రభాస్ ఈ తరహా పాత్ర తన తదుపరి సినిమాగా చేయాలని నిర్ణయించుకుని వీలు కుదిరినప్పుడల్లా రకరకాల పోలీసు స్టోరీలను వింటున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా ప్రభాస్ సూచనలకు అనుగుణంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా డిజైన్ చేస్తున్నారని టాక్. దీనికోసం ప్రభాస్ తన బాడీని షేప్ అప్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు బాహుబలి కోసం తాను పెంచుకున్న కండలను కొంత మంది డైటిషియన్స్ సలహాలతో ప్రభాస్ తన కండలను కరిగించే కార్యక్రమంలో బిజీ అయ్యాడని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: