బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య ర్యాయ్ తిరిగి ఫాంలోకి వస్తున్నట్టే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఐశ్వర్య రాయ్ ఎప్పుడైతే తల్లిగా మారిందో అప్పటి నుండి ఇప్పటి వరకూ సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. అతి కొద్ది వాణిజ్య ప్రకటనలకు తప్పితే, దాదాపు యాడ్స్ లోనూ ఐశ్వర్యరాయ్ కనిపించడం మానేసింది. కానీ తాజాగా మాజీ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ మార్చి-2015 మ్యాగజైన్ పై సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు.

డిఫరెంటు లుక్‌తో ఆమెను కవర్ పేజీపై ప్రజెంట్ చేసారు. ‘ఐశ్వర్యరాయ్... కంబ్యాక్? ఐ నెవెర్ వెంట్ ఎ వే' క్యాప్షన్‌తో ఉన్న కవర్ పేజీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇవ వివరాల్లోకి వెళితే, ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటోషూట్ లో ఐవ్వర్యరాయ్ తన అందాలను ఆరబోసినట్టుగా తెలుస్తుంది. అయితే వాటికి సంబంధించిన ఎక్స్ ఫోజింగ్ ఫోటోలను పబ్లిష్ చేయకుండా, కొద్దిపాటి హాట్ లుక్ ఫోటోని మాత్రమే ఆ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది.

ఇతర ఫోటోలను మాత్రం మరో నెల గ్యాప్ లో పబ్లిష్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కోలీవుడ్,టాలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐవ్వర్యరాయ్ నటేంచేందుకు ఆసక్తి చూపుతుందనే టాక్స్ వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభమైంది.

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆమె బాలీవుడ్ మూవీ ‘జబ్బా' సినిమాలో నటిస్తోంది. యాక్షన్, థ్రిలర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: