టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ని కలిగిఉన్న హీరో రవితేజ. గతంలో టాలీవుడ్ కి బ్లాక్ బ్టస్టర్ సక్సెస్ లని ఇచ్చిన రవితేజ, తరవాత వరుస ప్లాపులను కూడ ఇచ్చాడు. ఆ తరువాత మూవీ కథలను ఆలోచించి సెలక్ట్ చేసుకొని, వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ గతంలో చేసిన తప్పునే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే, మాస్ మహారాజ రవితేజ కెరీర్లో కమర్షియల్ గానే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చిన సినిమా ‘కిక్’. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రవితేజ మాత్రమే ఆ సినిమా చేయగలడని అన్నారు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపుగా ఆ పార్ట్ లోని రవితేజ – ఇలియానాల వారసుడి కథని ఆధారం చేసుకొని ‘కిక్ 2′ సినిమాని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మే మొదటి వారంలో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీ అనంతరం రవితేజ మరో మూడు మూవీలకి సంబధించిన షూటింగ్స్ లో వరుసగా పాల్గొనబోతున్నాడు. వాటిలో ఒకటి బెంగాల్ టైగర్ అయితే, మరోకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. రవితేజ ఇలా వరుస మూవీలను కమిట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళుతున్నాడు.

గతంలోనూ రవితేజ ఏ మాత్రం ఆలోచించకుండా వరుసగా చేసిన మూవీలు బాక్సాపీస్ వద్ద ఘోరంగా ఫెయిల్యూర్ అయ్యియి. ఇప్పుడు కూడ రవితేజా ఆ విధంగా మూవీలను సెలక్ట్ చేసుకుంటున్నాడనే టాక్ బయటకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: