పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు సినిమా రంగంలో ఉంటూనే, అటు పొలిటికల్ రంగంలోనూ తనదైన శైలిలో రాజకీయ చదరంగం ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మరో రెండు సంవత్సరాల పాటు కచ్చితంగా సినిమా రంగంలో బిజిగా ఉండబోతారు. ఎందుకంటే తన ముందు ఉన్న కమిట్మెంట్స్ అలాంటివి అని ఇండస్ట్రీ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ గబ్బర్ సింగ్2 మరోసారి హాట్ టాపిక్ గా మారబోతుంది.

ఈ మూవీకి సంబంధించిన విషయంలో పవన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే గబ్బర్ సింగ్2 డైరెక్టర్ మరోసారి మారబోతున్నట్టుగా తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' మూవీ ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గత రెండేళ్లుగా ఈ చిత్రం ప్రారంభానికి నోచుకోకుండా ఊగిసలాడుతూనే ఉంది. సంపత్ నంది దర్శకుడిగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు.

పలు కారణాలతో సినిమా ప్రారంభం కాకముందే సంపత్ నంది ఆ ప్రాజెక్టు నుండి బయటకు వచ్చారు. సంపత్ నంది స్టోరీ, స్క్రిప్టు వర్కు నచ్చకనే ఆయన్ను తీసేసినట్లు టాక్. దీంతో అదే స్టోరీతో సంపత్ నంది రవితేజతో ‘బెంగాల్ టైగార్' ప్లాన్ చేసుకున్నాడు. తర్వాత ‘పవర్' ఫేం బాబీ గబ్బర్ సింగ్ 2 చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు. పవన్ కళ్యాణే స్వయంగా స్టోరీ సమకూర్చారు. స్క్రిప్టు వర్కు మాత్రం బాబీకి అప్పగించాడు.

అయితే బాబీ కూడా పవన్ కళ్యాణ్‌ని మెప్పించలేక పోయాడని టాక్. దీంతో బాబీ కూడా ఈ ప్రాజెక్టు నుండి ఔట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. దీంతో గబ్బర్ సింగ్2 డైరెక్టర్స్ ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ స్ర్కీన్ ప్లే ఎవ్వరికి అంతు చిక్కడం లేదనే విషయం పిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: