కోలీవుడ్ టాప్ హీరో విజయ్ జీవితానికి టాలీవుడ్ ఎంపరర్ పవన్ ఆలోచనలకు చాల అనుబందం ఉంది. వీరిద్దరూ కూడా సినిమా నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి కెరియర్ మధ్యలో ఎన్నో ఫ్లాప్ లు వచ్చినా తిరిగి తమ సినిమాలను సూపర్ హిట్ సినిమాలుగా మార్చుకోగలిగారు. అంతేకాదు వీరిద్దరూ ఒకరి సినిమాలను మరొకరు రీమేక్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకున్నారు.

పవన్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడే వీరాభిమానులు ఉన్నట్లే విజయ్ కి కూడా సినిమా జయాపజయాలతో సంబందం లేకుండా విపరీతంగా విజయ్ ని ఆరాధిస్తారు. ఈ నేపద్యంలో పవన్ కు ఎదురైన ఒక వింత అనుభవం విజయ్ కు కూడ ఎదురు కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఆ మధ్య శ్రీజ అనే అమ్మాయి క్యాన్సర్ వ్యాదితో బాథ పడుతూ మృత్యువుతో పోరాటం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పవన్ ఆ అమ్మాయిని పలకరించి ఆర్ధక సహాయం చేసాడు.

అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఆ అమ్మాయి మృత్యువుని జయించి ఇప్పుడు ఆరోగ్య వంతురాలిగా మారింది. ఇదే విధంగా చెన్నైలో క్యాన్సర్ తో బాధ పడుతూ డాక్టర్లు తాము బ్రతికించలేము అని చేతులెత్తేసిన ముగ్గురు చిన్నారులను విజయ్ కలిసి వారికి ధైర్యం చెప్పాక డాక్టర్లు ఆ పిల్లల తల్లితండ్రుల ఒత్తిడితో అయిస్టంగా ఆపరేషన్ చేసిన నేపధ్యంలో ఆ పిల్లలు బ్రతకడం చెన్నై డాక్టర్స్ ను ఆశ్చర్య పరిచిందని టాక్.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈ మధ్య విడుదలయిన ‘కత్తి’ సూపర్ హిట్ తరువాత విజయ్ అభిమానులు వచ్చే సంవత్సరం జరగబోతున్న తమిళనాడు ఎన్నికలలో విజయ్ ను పోటీ చేయమని లేదంటే కనీసం ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వమని విజయ్ పై అతడి అభిమానులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాదు విజయ్ పై భారతీయ జనతా పార్టీ తన దృష్టిని అప్పుడే పెట్టేసింది అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్న పవన్ విజయ్ లు తమ ఓదార్పుతో తమ అభిమానుల ప్రాణాలు కాపాడటమే కాకుండా రాజకీయ పరంగా కూడ ఒకే రకం ఒత్తిడి ఎదుర్కోవడం యాదృచ్చికమే అయినా అందర్నీ ఆశ్చర్య పరిచే విషయంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: