‘టెంపర్’ సినిమా జూనియర్ కోరుకున్న50 కోట్ల రికార్డుల క్లబ్ లో నిలబెట్ట లేక పోవడంతో ఇక తన ఆశలు అన్నీ ఎల్లుండి మార్చి 5 వతారీఖు నుండి ప్రారంభం కాబోతున్న సుకుమార్ సినిమా పై పెట్టుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఇప్పటికే లాంచనంగా జరిగి పోవడంతో ఇక రెగ్యులర్ షూటింగ్ పై మనసు పెడుతున్నాడు జూనియర్.

తండ్రి కొడుకుల అనుబంధం నేపధ్యంలో తీయబడుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా జగపతి బాబు నటిస్తున్న విషయం తెలిసిదే. అయితే ఈ సినిమాలో సుకుమార్ జూనియర్ ను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించ బోతున్నాడని టాక్. సుకుమార్ సినిమాలలోని హీరోలకు సర్వ సాధారణంగా ఉండే నెగిటివ్ షేడ్స్ అన్నీ జూనియర్ పాత్రకు కూడ ఉంటాయట.

‘టెంపర్’ సినిమాలో జూనియర్ పేల్చిన ‘దండ యాత్ర ఇది దయాగాడి దండ యాత్ర’ డైలాగ్ ధియేటర్లలో ఎలా మారుమ్రోగి పోయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ డైలాగ్ లోని దండయాత్ర పదం జూనియర్ సుకుమార్ల కొత్త సినిమాకు టైటిల్ గా మారబోతోంది అని ఫిలింనగర్ టాక్. ఈ దండయాత్ర టైటిల్ కు జూనియర్ కూడ ఓకే చెప్పడంతో అతి త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుంది అని తెలుస్తోంది.

జూనియర్ కు తీరనికలగా మిగిలి పోయిన 50 కోట్ల కలెక్షన్స్ మైలు రాయిని ఈ సినిమా ద్వారా అయినా అందుకోవాలని జూనియర్ తెగ తాపత్రయ పడుతున్నట్లు టాక్. ఈమధ్య కాలంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు వరస పెట్టి షాక్ లు తగులుతూ ఉండటంతో జూనియర్ కోసం తన రేంజ్ ని పూర్తిగా చూపెడుతూ ఒక పవర్ ఫుల్ ఆడియోను ఈ సినిమాకు ఇవ్వడానికి దేవిశ్రీ ఇప్పటికే అనేక ట్యూన్స్ రెడీ పెట్టాడు అని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: