20 సంవత్సరాల క్రితం వరకు గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్, బాలీవుడ్ లను షేక్ చేసిన జయప్రద ఆ తరువాత తనకు సినిమాలలో అవకాశాలు తగ్గడంతో రాజకీయాల బాట పట్టింది. అనేక పార్టీలు మారుతూ ప్రస్తుతం జయప్రద బిజెపి తీర్ధం పుచ్చుకుంది. ఢిల్లీ ఎన్నికలలో ఆమెకు అవకాశం వస్తుందని ఆశించినా ఆమెకు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది.

ఇలాంటి పరిస్థుతులలో టాప్ యంగ్ హీరోలకు అమ్మగా, అత్తగా మారుదామని ఆమె ప్రయత్నిస్తున్నా టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు ఎవ్వరూ ప్రస్తుతం ఆమెను పట్టించు కోవడం లేదు. ఈ పరిస్థుతులలో ఆమె కోలీవుడ్ లో సినిమాలు తీస్తూ కాలం గడుపుతోంది. అయితే ఈమధ్య ఒక పెళ్ళి ఫంక్షన్ లో జయప్రద వేసుకున్న డ్రస్ అనేక సెటైర్లకు తావిచ్చింది.

ఇక వివరాలలోకి వెళితే ఒకనాటి ఈ గ్లామర్ బ్యూటీ తన అక్క కొడుకు సిద్ధూ నిశ్చితార్ధ వేడుకలో లంగా ఓణి గెటప్ లో ఇలా కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఆమె ఆద్వర్యంలో జరుప బడ్డ ఈ ఫంక్షన్ కు చాలామంది ఫిలిం సెలెబ్రెటీలు కూడా వచ్చారు. ఆ లిస్టులో రాఘవేంద్రరావు కూడా ఉండటంతో ఆయనను జయప్రద స్వయంగా ఆహ్వానించి సందడి చేసింది.

అయితే ఈ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది అతిధులు ఈ దృశ్యాన్ని చూసి జయప్రద 16 ఏళ్ల అమ్మాయిలా మారిపోవడానికి తెగ ప్రయత్నం చేస్తోంది అని సెటైర్లు వేసారు. అంతేకాదు రాఘవేంద్రరావు గతంలో శ్రీదేవితో తీసిన ‘పదహారేళ్ళ వయస్సు’ సినిమాను తిరిగి జయప్రదతో మళ్ళీ ఈ గెటప్ లో రీమేక్ చేస్తే బాగుంటుందేమో అని సెటైర్లు వేసుకున్నారని టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: