గుణశేఖర్ దర్శకత్వంలో భారీ పెట్టుబడితో రూపొందించిన ‘రుద్రమదేవి’ టీజర్ నిన్న సాయంత్రం విడుదలైతే ఈరోజు ఉదయానికి ఈ ట్రైలర్ ను చూసిన వారి సంఖ్య 5 లక్షలకు చేరువ కావడం ఈ సినిమా పట్ల తెలుగు ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉందో అర్ధం అయ్యేలా చేసింది. అయితే ఇంత పాజిటివ్ రిజల్ట్ లో కూడా సమాంతరంగా కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఈసినిమా ట్రైలర్ పై రావడం ఈ సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్ తో పాటు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న అనుష్కకు కూడా షాకింగ్ గా మారింది అనే మాటలు వినిపిస్తున్నాయి.

వెబ్ మీడియాలో ఈ ట్రైలర్ ను చూసిన నెటిజన్లు రుద్రమదేవిగా అనుష్క నటన కంటే పెర్ఫామెన్స్ పరంగా గోనగన్నారెడ్డి పాత్రను చేసిన అల్లుఅర్జున్ అదేవిధంగా నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్న రానా చాల అద్భుతంగా నటించారు అనే కామెంట్స్ అనుష్క వరకు వెళ్లాయని తెలుస్తోంది. అదేవిధంగా ఈ ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ సంతృప్తికరమైన స్థాయిలో లేవనే కామెంట్స్ రావడం గుణశేఖర్ కు టెన్షన్ పెడుతోంది అని టాక్.

అదేవిధంగా ఈ ట్రైలర్ లోని కలర్ థీమ్ కూడా రియాల్టీగా లేదనే కామెంట్స్ కొందరు చేస్తున్నారని టాక్. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలన్నీ తెలుగు భాషలోకి డబ్ అవుతూ ఉండటంతో ఆ సినిమాలలో హై క్వాలిటీ గ్రాఫిక్స్ చూడటానికి అలవాటు పడ్డ తెలుగు ప్రేక్షకులు సంకేతిక పరంగా ‘రుద్రమదేవి’ సినిమాలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే గుణశేఖర్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది అనే మాటలు కూడ వినిపిస్తున్నాయి.

అయితే గతంలో ట్రైలర్ లో అదరగొట్టిన అనేక భారీ సినిమాలు విడుదల అయ్యాక ఘోర పరాజయాన్ని పొందిన నేపధ్యంలో కేవలం నిన్న విడుదలైన ఒకేఒక్క ట్రైలర్ ను బట్టి ‘రుద్రమదేవి’ స్థాయిని పాజిటివ్ గగాని లేదంటే నెగిటివ్ గగాని అంచనా వేయడం అవివేకమే అవుతుంది. ఈసినిమాను ఏప్రియల్ 24న విడుదల చేయాలని గుణశేఖర్ తన సర్వ శక్తులు పెట్టి ప్రయత్నం చేస్తున్నాడని ఫిలింనగర్ టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: