ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో అత్యంత భయంకరమైన ఫ్లాప్ ల లిస్టులో రాజశేఖర్ ‘గెడ్డం గ్యాంగ్’ మొదటి స్థానంలో నిలిస్తే రెండవ స్థానంలో గతవారం హవీష్ హీరోగా వచ్చిన ‘రామ్ లీల’ సినిమాలు నిలబడతాయి అని టాలీవుడ్ విశ్లేషకులు సెటైర్లు వేయడమే కాకుండా ఈ రెండు సినిమాలకు ఈ సంవత్సరపు అత్యంత భయంకరమైన సూపర్ ఫ్లాప్ ల రికార్డులను కట్ట బెట్టారు.

అంతేకాదు ఈ రెండు సినిమాలు ప్రదర్శింప పడ్డ ధియేటర్ల కు కరెంట్ ఖర్చులు కూడ రాలేదు అనే వార్తలు మరింత షాకింగ్ గా మారాయి. ఇక ఈ వార్తలు ఇలా ఉండగా గత నెల విడుడుదల అయిన ‘గెడ్డం గ్యాంగ్’ రాజశేఖర్ ను ఆర్ధికంగా విపరీతంగా కుంగ తసింది అని వార్తలు వస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘గడ్డం గ్యాంగ్’ ను కొనుక్కోవడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా రాజశేఖర్ ఈ సినిమాను విడుదల చేసాడు అని టాక్. ఈ సినిమాకు రెండవ వారం పోస్టర్ కూడ పడక పోవడంతో రాజశేఖర్ కు ఈ సినిమా 4.5 కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టిందని అంటున్నారు. ఈసినిమాకు వచ్చిన కలెక్షన్స్ పబ్లిసిటీ ఖర్చులకు ప్రింట్ కాస్టులకు సరిపోయే స్థాయిలో లేకపోవడం ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్న రాజశేఖర్ ను తీవ్రంగా నిరాశ పరిచింది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో వచ్చిన నష్టాల నుండి బయటకు రావడానికి ఎదో రకమైన పాత్రలను సినిమాలలో చేస్తూ కొంత వరకు కోలుకోవాలనే ఆలోచనలతో అటు జీవిత ఇటు రాజశేఖర్ లు సినిమాలలో నటించాలనే ఉద్దేశ్యంతో తమకు తెలిసిన దర్శక నిర్మాతలందర్నీ టచ్ లోకి తీసుకుని తమకు మంచి అవకాశాలు ఇవ్వమని అడుగుతున్నా సరైన ప్రతిస్పందన ఏ దర్శకుడి నుండి రాకపోవడం వీరిద్దరికీ షాకింగ్ గా మారిందని ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: