స్టైలీష్ స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ జానపద సినిమాల్లో ఇప్పటి వరకు చేయలేదు. దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం రుద్రమదేవి సినిమాలో మనోడికి మంచి క్యారెక్టర్ దొరికింది అదే గోన గన్నారెడ్డి. ఇప్పటి వరకు మనోడు యాక్షన్, రొమాంటిక్ సినిమాలు చేశాడు రొటీన్ కు భిన్నంగా ఈ పాత్రలో అర్జున్ బాగానే సూట్ అయ్యిందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు.

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ 3-డీ సినిమా రుద్రమదేవి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనుష్క రుద్రమదేవిగా నటిస్తున్న ఈ సినిమాలో దగ్గుపాటి రానా రుద్రమదేవి భర్తగా చాళుక్య వీరభద్రుడి క్యారెక్టర్‌లో నటిస్తున్నారు.

నిన్న విడుదలలైన రుద్రమదేవి ట్రైలర్‌లో గోన గన్నారెడ్డిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హైలెట్ అయ్యాడు. అల్లు అర్జున్ గెటప్ చాలా మాస్ గా ఉంది. డైలాగ్స్ కూడా చాలా సీరియస్ గా మంచి పోరాల యోధుడిగా వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇక మనోడి పోరాట సన్నివేశాలు, గుర్రపుస్వారీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందనే చెప్పొచు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: