పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోతో అవకాశం కలిపిస్తే హీరోయిన్ గా నటిస్తాను అంటూ ఈమధ్య సంచలన కామెంట్స్ చేసిన అనసూయ కొద్ది రోజులు తిరగ కుండానే మరో సంచలనం చేసింది. ఈసారి ఏకంగా టాప్ కమెడియన్ మరియు యాంకర్ అలీకి అనసూయ అనుకోని షాక్ ఇచ్చింది.

బుల్లితెర గేమ్ షోలలో ‘జబర్దస్త్’ రేటింగ్స్ స్థాయిలో లేకపోయినా అలీ హోస్ట్ చేస్తున్న ATM రియాలిటీ షోకు మంచి స్పందనే వస్తోంది. జెమిని టివిలో వారానికి మూడు సార్లు ప్రతి సోమ, మంగళ, బుధ వారాలలో ప్రశారం అవుతున్న ఈ షోను ఇష్ట పడే బుల్లితెర ప్రేక్షకులు కూడా చాలామంది ఉన్నారు. అయితే అనుకోకుండా ఈ షో నుండి అలీని తప్పించి అనసూయను యాంకర్ గా చేసారు అనే వార్తలు వస్తున్నాయి.

దీనికి కారణం ఈ కార్యక్రమ నిర్వాహకులకు అలీకి పారితోషిక విషయంలో వచ్చిన భేదాబిప్రాయాలే కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా అలీ సినిమాలలో బిజీగా నటిస్తూ మధ్యలో పెద్దపెద్ద ఈవెంట్స్ చేస్తూ ఉండటంతో అలీకి ఈ ATM కార్యక్రమం పట్ల కొంత శ్రద్ధ తగ్గింది అని ఈ కార్యక్రమ నిర్వాహకుల అభిప్రాయం అట.

దీనికి తోడు అలీకి ఇచ్చే పారితోషికం కన్నా తక్కువ పారితోషికాన్ని అనసూయ కోట్ చేయడంతో ఈ మార్పు జరిగింది అనే గాసిప్పులు వినపడుతున్నాయి. ఒక వైపు త్వరలో నాగార్జున సినిమాలో నటించబోతున్న అనసూయకు ఈ గేమ్ షోలో ఆఫర్ వచ్చింది అని వార్తలు రావడం ఆమెకు మరో టర్నింగ్ పాయింట్ అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: